రాద్ధాంతం అయ్యాక రాజీ చేశారా... రోహిత్, విరాట్ కోహ్లీలతో బీసీసీఐ వీడియో కాన్ఫిరెన్స్..

First Published Nov 29, 2020, 4:34 PM IST

కాసుల కోసం కరోనాను కూడా లెక్క చేయకుండా ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించిన బీసీసీఐ, ఆటగాళ్ల మధ్య ఏర్పడిన గొడవలను మాత్రం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో బీభత్సమైన రచ్ఛ జరిగింది. రోహిత్ శర్మ గాయం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పడం, తనకు అసలు రోహిత్ ఆస్ట్రేలియాకి ఎందుకు రాలేదో కూడా తెలియదని విరాట్ కోహ్లీ చెప్పడం తీవ్రమైన చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై ఓ పరిష్కారం తెచ్చేదిశగా అడుగులు వేసిందట బీసీసీఐ.

భారత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయని, దాదాపు ఏడాదిన్నర వినిపిస్తున్న వార్త. వన్డే వరల్డ్‌కప్ 2019లో భారత జట్టు సెమీస్ నుంచి తప్పుకోవడానికి కూడా ఈ వివాదమై కారణమనే టాక్ ఉంది.
undefined
అయితే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని నచ్చజెప్పడానికి ప్రయత్నించిన బీసీసీఐ, ముదురుతున్న వివాదానికి ఓ పరిష్కారం కనుగొనే ప్రయత్నం మాత్రం చేయలేదు...
undefined
రోహిత్ శర్మ ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీనీ, ఆయన సతీమణి అనుష్క శర్మ అన్‌ఫాలో చేయడంతో మొదలైన రచ్చ... ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను కావాలనే ఎంపిక చేయలేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ విరుచుకుపడేదాకా వచ్చింది.
undefined
తాజాగా రోహిత్ శర్మ, భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా ఎందుకు రాలేదో తనకి తెలియదని మీడియా కాన్ఫిరెన్స్‌లో విరాట్ కోహ్లీ వెల్లడించడం మరో చర్చను లేవనెత్తింది...
undefined
రోహిత్ శర్మ గాయం గురించి, అతని పరిస్థితి గురించి బీసీసీఐ, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎందుకు తెలియచేయలేదని నిలదీస్తున్నారు క్రికెట్ అభిమానులు... రోహిత్, విరాట్ మధ్య మాటలు లేవని స్పష్టంగా తెలుస్తున్నా, ఇంకా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
వివాదం ముదురుతుండడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి సమక్షంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కలిపేందుకు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిందట బీసీసీఐ.
undefined
ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరమని ఫిజయో చెప్పాడు. అయితే దాన్ని లెక్కచేయకుండా ఐపీఎల్‌లో మూడు మ్యాచుల్లో పాల్గొన్నాడు రోహిత్ శర్మ. తాను ఫిట్‌గా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు.
undefined
ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌లో ఉంటాడని భావించాడట విరాట్ కోహ్లీ. అయితే తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వదేశం వెళ్లిన రోహిత్, ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న విషయం కూడా కెప్టెన్‌కి సమాచారం లేదట.
undefined
డిసెంబర్ 11న రోహిత్ శర్మ గాయాన్ని మరోసారి పరీక్షించనున్న బీసీసీఐ ఫిజయో...ఫిట్‌నెస్ పరీక్ష అనంతరం అతన్ని ఆస్ట్రేలియా పంపాలా? లేదా? అనే విషయం తేల్చనున్నారు.
undefined
ఈ వీడియో కాన్ఫిరెన్స్ తర్వాత విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ గాయం గురించి పూర్తి క్లారిటీ వచ్చిందని, వీరిద్దరి మధ్య నెలకొన్న మనస్ఫర్థలు కూడా కాస్త కుదుటపడ్డాయని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
click me!