లక్నో కోచ్ గా ప్రముఖ జింబాబ్వే క్రికెటర్..? ఇంగ్లాండ్ మాజీ హెడ్ కోచ్ ను తీసుకొస్తున్న సంజీవ్ గొయెంకా

Published : Dec 16, 2021, 03:09 PM IST

Andy Flower: భారీ ఆశలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఐపీఎల్ లోకి అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ.. ఆ మేరకు  ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కోసం భారీగానే ఖర్చు పెడుతున్నది.   

PREV
18
లక్నో కోచ్ గా ప్రముఖ జింబాబ్వే క్రికెటర్..? ఇంగ్లాండ్ మాజీ హెడ్ కోచ్ ను తీసుకొస్తున్న సంజీవ్ గొయెంకా

జింబాబ్వే  మాజీ క్రికెటర్,  ఆ జట్టుకు సుమారు పదేండ్ల పాటు వికెట్ కీపర్ గా సేవలందించిన  ఆండీ ఫ్లవర్ ఐపీఎల్ లో కొత్త బాధ్యతల్లో మెరువనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

28

ఐపీఎల్ లో ఇటీవలే ముగిసిన కొత్త  జట్ల బిడ్ ల ప్రక్రియలో భాగంగా లక్నో ను  దక్కించుకున్న  ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ  గ్రూప్ ఈ లెజెండరీ క్రికెటర్ ను సంప్రదించినట్టు సమాచారం. 

38

లక్నో ఫ్రాంచైజీకి ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్ గా సేవలందించనున్నట్టు తెలుస్తున్నది.  ఈ మేరకు ప్రముఖ క్రీడా జర్నలిస్టు ఒకరు స్పందిస్తూ.. ‘లక్నో కోచ్ గా ఆండీ ఫ్లవర్.  వచ్చే వారంలో అహ్మదాబాద్ కోచ్ ఎవరో తెలిసిపోనుంది..’ అని పేర్కొన్నాడు. 

48

ఆండీ ఫ్లవర్ గతంలో  ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ కు కూడా అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు.  ఆ జట్టులోని కెప్టెన్ కెఎల్ రాహుల్.. పంజాబ్ ను వీడిన విషయం తెలిసిందే. అతడు వచ్చే ఐపీఎల్ సీజన్ లో లక్నోతో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

58

ఇక కెఎల్ రాహుల్ స్వయంగా కోరడంతోనే ఆండీ ఫ్లవర్ ను  లక్నో కు హెడ్ కోచ్ గా నియమించేందుకు ఆర్పీఎస్జీ  ప్రయత్నించిందని  తెలుస్తున్నది.  లక్నో ప్రతిపాదనకు ఆండీ కూడా ఒప్పుకున్నాడని, దీంతో సంజీవ్ గొయెంకా కూడా ఊపిరిపీల్చుకున్నట్టు  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

68

కెఎల్ రాహుల్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్  రషీద్ ఖాన్ తో కూడా ఆ జట్టు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.   రాహుల్ కోసం రూ. 20 కోట్లైనా ఖర్చు  చేయడానికి లక్నో సిద్ధంగా ఉంది.  రాహుల్ కోరిక మేరకే వస్తున్న ఆండీ ఫ్లవర్ కు కూడా ఆర్పీఎస్జీ భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం. 

78

1992 నుంచి 2003 వరకు జింబాబ్వేకు ఆడిన ఆండీ ఫ్లవర్..  దక్షిణాఫ్రికా లో పుట్టి ఆ తర్వాత జింబాబ్వే తరఫున క్రికెట్ ఆడాడు. తన కెరీర్ లో 63 టెస్టులు, 213 వన్డేలు ఆడిన ఆయన.. 90వ దశకంలో ఉత్తమ వికెట్ కీపర్ లలో ఒకడు.  
 

88

జింబాబ్వే క్రికెట్ నుంచి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం దక్కించుకున్న క్రికెటర్ గా ఆండీ ఫ్లవర్ రికార్డులకెక్కాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఆయన  ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేశారు. 2009 నుంచి 2014 దాకా ఆయన ఇంగ్లీష్ జట్టుకు ప్రధాన శిక్షకుడిగా ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టుతో  పాటు ముల్తాన్ సుల్తాన్స్, సెయింట్ లుసియా జౌక్స్ కు కూడా ఆయన కోచ్ గా వ్యవహరించారు. ఇక గత సీజన్ లో ఆయన కింగ్స్ లెవెన్ పంజాబ్ కు అసిస్టెంట్ కోచ్ గా సేవలందించారు. 
 

click me!

Recommended Stories