డేల్ స్టెయిన్ ఆల్‌-టైం బెస్ట్ టీమ్ ఎలెవన్ ఇదే... టీమిండియా నుంచి ఆ ఇద్దరికీ చోటు...

First Published Jun 27, 2021, 1:45 PM IST

ఆరేళ్ల పాటు ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకులో కొనసాగిన ఏకైక బౌలర్ల డేల్ స్టెయిన్ పుట్టినరోజు నేడు. సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో టాప్ క్లాస్ స్టార్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డేల్ స్టెయిన్.. కొన్నాళ్లుగా జట్టుకి దూరంగా ఉన్నాడు.

2004 డిసెంబర్‌లో ఆరంగ్రేటం చేసిన డేల్ స్టెయిన్, ఆ తర్వాతి ఏడిది 74వ ర్యాంకులోకి, 2006లో 48వ ర్యాంకులోకి, 2007లో 33వ ర్యాంకులోకి ఎగబాకాడు...
undefined
ఆ తర్వాతే డేల్ స్టెయిన్ అసలు సిసలైన స్టార్‌డమ్ పర్ఫామెన్స్ మొదలైంది. 2008, 2009 ఏడాది రెండో ర్యాంకులో కొనసాగిన డేల్ స్టెయిన్, 2010 నుంచి 2015 దాకా ఆరేళ్ల పాటు టాప్ బౌలర్‌గా కొనసాగాడు..
undefined
దక్షిణాఫ్రికా తరుపున 200 నుంచి 400 వికెట్ల దాకా అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన డేల్ స్టెయిన్, 9 టెస్టు జట్లపై ఐదేసి వికెట్లు తీసిన ఏకైక పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్, బెస్ట్ బౌలింగ్ స్ట్రైయిక్ రేటుతో వికెట్లు సాధించాడు.
undefined
టెస్టుల్లో 18,608 బంతులు బౌలింగ్ చేసిన డేల్ స్టెయిన్, 439 వికెట్లు తీయగా... ఆ తర్వాత ఆ రికార్డు రిచర్డ్ హార్ల్‌లేదే. రిచర్డ్ ఇన్ని బంతులు వేసే సరికి 365 వికెట్లు తీయగలిగాడు. మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, అశ్విన్, ఇమ్రాన్ ఖాన్ వంటి లెజెండ్స్ కూడా ఇన్ని తక్కువ బంతుల్లో అన్ని వికెట్లు తీయలేకపోయారు.
undefined
కొన్నాళ్ల క్రితం తన ఆల్‌-టైం బెస్ట్ ఎలెవన్ టీమ్‌ను ప్రకటించిన డేల్ స్టెయిన్, దక్షిణాప్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌ను తన టీమ్‌కి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఎంచుకున్నాడు.
undefined
గ్రేమ్ స్మిత్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా వస్తాడు. మూడో స్థానంలో సౌతాఫ్రికా మాజీ సెన్సేషన్ హషీం ఆమ్లాను ఎంపిక చేశాడు స్టెయిన్.
undefined
నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్, ఐదో స్థానంలో సఫారీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్, ఆరో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగర్కరను ఎంపిక చేశాడు..
undefined
ఏడో స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్, ఆ తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు డేల్ స్టెయిన్.
undefined
పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్, ఆసీస్ స్టార్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌లను 11 మంది జట్టులో పేసర్లుగా ఎంచుకున్న స్టెయిన్, ఆలెన్ డొనాల్డ్, జాంటీ రోడ్స్‌లకు ఎక్స్‌ట్రా ప్లేయర్లుగా చోటు కల్పించాడు.
undefined
click me!