Deepak Chahar: త్వరలోనే దీపక్ చాహర్ పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ కూడా వచ్చేసింది..

Published : May 21, 2022, 05:55 PM IST

Deepak Chahar Marriage Date: టీమిండియా యువ ఆటగాడు దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  చాలా కాలంగా జయా భరద్వాజ్ తో ప్రేమలో ఉన్న చాహర్.. త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నాడు.

PREV
19
Deepak Chahar: త్వరలోనే దీపక్ చాహర్ పెళ్లి.. వెడ్డింగ్ కార్డ్ కూడా వచ్చేసింది..

టీమిండియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్  సభ్యుడిగా ఉన్న  దీపక్ చాహర్.. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నాడు. గాయం కారణంగా రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్న అతడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు.

29

అతడి స్నేహితురాలు, చాలా కాలంగా ప్రేమలో ఉన్న  జయా భరద్వాజ్ తో కలిసి అతడు  2022 జూన్ 1న  ఏడడుగులు నడువబోతున్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా పంజాబ్ తో ముగిసిన ఆఖరి లీగ్ మ్యాచ్   అనంతరం చాహర్.. జయాకు అందరి ముందే రింగ్ ఇచ్చి  ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. 

39
Deepak Chahar

ఢిల్లీకి చెందిన జయా.. ఓ కార్పోరేట్ కంపెనీలో పనిచేస్తున్నది. ఆమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ సోదరి. బిగ్ బాస్-5 సీజన్ (హిందీ) లో కనిపించిన సిద్ధార్థ్.. తర్వాత ఎంటీవీ ప్రఖ్యాత షో స్ప్లిట్స్ విల్లా లో గుర్తింపు పొందాడు. 
 

49

దీపక్  పెళ్లి విషయాన్ని అతడి తండ్రి లోకేందర్ సింగ్ చాహర్ తెలిపాడు.  దీపక్-జయా ల పెళ్లి కి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపిన ఆయన.. పెళ్లి కార్డులను కూడా ప్రింట్ చేశామని వాటిని  ఆహ్వానిథులకు అందజేయడమే మిగిలుందని తెలిపాడు. 

59

ఉత్తరప్రదేశ్ కు చెందిన  చాహర్ పెళ్లి ఎక్కడ జరుగుతుందనేది మాత్రం లోకేందర్ సింగ్ వెల్లడించలేదు. కాగా గతేడాది  దీపక్ చాహర్ సోదరుడు  రాహుల్ చాహర్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు) ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీ జోహర్ తో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

69

గోవాలోని ఓ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో మార్చి 9న పెళ్లి చేసుకున్నాడు. తనకంటే పెద్దవాడైన  దీపక్ ఉన్నా.. రాహుల్ ముందు పెళ్లి చేసుకోవడం గమనార్హం. 

79

 కాగా ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో రూ. 14 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్..  దీపక్ ను దక్కించుకుంది. కానీ తొడ కండరాల గాయంతో అతడు ఈ సీజన్ మొత్తం దూరమయ్యాడు. ఫలితంగా చెన్నై  ఈ సీజన్ లో  ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయింది. 

89

గాయం కారణంగా నాలుగు నెలలు రెస్ట్ తప్పదని దీపక్ కు వైద్యులు సూచించారు.  ఆగస్టులో అతడు మళ్లీ ఫీల్డ్ లోకి  అడుగుపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. ఆ మేరకు  దీపక్ కసరత్తులు చేస్తున్నాడు.

99

ఈ ఏడాది  అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా  మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ నాటికల్లా  తనను తాను సిద్ధం చేసుకోవాలని అతడు భావిస్తున్నాడు. ఆలోపు పెళ్లి తంతు కూడా ముగించుకోవాలని దీపక్ భావించి ఉంటాడు. 
 

click me!

Recommended Stories