ఐపీఎల్ 2021ను వదలని కరోనా మహమ్మారి... సీఎస్‌కే కోచ్ మైకేల్ హుస్సీకి కరోనా పాజిటివ్...

Published : May 11, 2021, 09:29 AM IST

ఐపీఎల్ 2021 వాయిదా పడి వారం రోజులైనా ఆగని పాజిటివ్ కేసులు... ప్రసిద్ధ్ కృష్ణ, స్టిఫర్ట్ తర్వాత తాజాగా సీఎస్‌కే కోచ్ మైక్ హుస్సీకి కరోనా పాజిటివ్...

PREV
15
ఐపీఎల్ 2021ను వదలని కరోనా మహమ్మారి... సీఎస్‌కే కోచ్ మైకేల్ హుస్సీకి కరోనా పాజిటివ్...

ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా మహమ్మారి వదలడం లేదు. సీజన్ వాయిదా పడి వారం రోజులు గడుస్తున్నా, ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ మైకేల్ హుస్సీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

25

బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌గా తేలిన వెంటన, హుస్సీ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో చికిత్స అందించింది సీఎస్‌కే. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

35

ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం వచ్చిన ఆసీస్ ప్లేయర్లు, సిబ్బంది, కోచ్‌లు మాల్దీవులకు వెళ్లినా, మైక్ హుస్సీ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు.

45

మైక్ హుస్సీతో కలిసి సీఎస్‌కే నుంచి కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. బౌలింగ్ కోచ్ బాలాజీతో పాటు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్, బస్ క్లీనర్‌కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

55

కేకేఆర్, ఢిల్లీ, హైదరాబాద్ జట్లలో పాజిటివ్ కేసులు నమోదుకావడంతో వరుణ్ చక్రవర్తి స్కానింగ్ కోసం బయటికి వెళ్లిరావడమే కారణంగా తేలినా... చెన్నై సూపర్ కింగ్స్‌లో పాజిటివ్ కేసులు రావడానికి సీఈవో కాశీ విశ్వనాథ్, లేదా బస్ క్లీనర్‌లలో ఎవరో ఒకరు బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించి ఉంటారని అనుమానిస్తున్నారు నిర్వహకులు.

click me!

Recommended Stories