కేజీఎఫ్ స్టార్ యష్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన చాహాల్, ధనుశ్రీ... ఫుల్లు బిజీగా గడిపేస్తున్న కొత్త జంట...

First Published Feb 11, 2021, 1:26 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు భారత క్రికెటర్ యజేంద్ర చాహాల్. ఐపీఎల్ సమయంలో కాబోయే భార్యతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన చాహాల్, ఆసీస్ టూర్ ముగిసిన తర్వాత ధనుశ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త జంట యమా బిజీగా గడుపుతోంది. 

టెస్టు టీమ్‌కి దూరమైన యజేంద్ర చాహాల్, భార్య ధనుశ్రీ వర్మతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ తెగ హల్‌చల్ చేస్తోంది కొత్త జంట.
undefined
కొన్నాళ్ల కిందట దుబాయ్‌లో సంగీత్ వేడుక, హనీమూన్ జరుపుకున్న ధనుశ్రీ వర్మ, యజ్వేంద్ర చాహాల్... అక్కడే భారత క్రికెటర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి సింగ్‌లను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
undefined
తాజాగా కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్ సంపాదించిన సాండల్‌వుడ్ హీరో యష్‌ను కలిశారు యజ్వేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ. యష్, ఆయన భార్య రాధికా పండిత్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్...
undefined
బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ నైట్ చేసేందుకు వచ్చిన యజ్వేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ... అక్కడే ఉన్న యష్, ఆయన భార్యలతో కలిసి ఫోటోలను ఫోజులు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న యష్, అదే గెటప్‌లో దర్శనమిస్తున్నాడు.
undefined
హర్యానాకి చెందిన యజ్వేంద్ర చాహాల్, కొన్ని సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఐపీఎల్ ఆడుతున్నారు. ప్రీమియర్ లీగ్ సమయంలోనే బెంగళూరుతో తనకి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.
undefined
వీలు దొరికినప్పుడల్లా బెంగళూరు నగరానికి వచ్చే యజ్వేంద్ర చాహాల్, ఇక్కడ ఓ విలాసవంతమైన ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా సమాచారం. యజ్వేంద్ర చాహాల్ భార్య ధనుశ్రీ వర్మ ముంబైకి చెందిన డ్యాన్సర్. ఆమె ఫ్యామిలీ దుబాయ్‌లో సెటిల్ అయ్యారు.
undefined
యజ్వేంద్ర చాహాల్‌తో పెళ్లి తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుశ్రీ వర్మ, త్వరలో డ్యాన్స్ వీడియోలు, ఆల్బమ్‌లు విడుదల చేసి, వాటిని మంచి హిట్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం డ్యాన్స్ ప్రాక్టీస్, షూటింగ్స్ అంటూ తెగ బిజీగా గడుపుతోంది ధనుశ్రీ వర్మ...
undefined
click me!