2022లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు, సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి ముగింపు పలికారు. మహిళల క్రికెట్‌లో లెజెండ్‌గా కీర్తిఘడించిన మిథాలీ రాజ్, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు పలికింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన వుమెన్ క్రికెటర్‌గా టాప్‌లో నిలిచింది...