ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండేళ్లుగా సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి గంటలోనే మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. గత రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్... 4 బంతుల్లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
27
మొదటి ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్... కెఎల్ రాహుల్‌కి ఇది విదేశాల్లో నాలుగో టెస్టు డకౌట్...
37
ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లోనే, బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 4 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
47
అండర్సన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ కావడం ఇది 10వ సారి కాగా, ఇంగ్లాండ్‌లో 8వ సారి... స్వదేశంలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా పూజారా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు.
57
పూజారా అవుటైన తర్వాత మూడో వికెట్‌కి 17 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
67
కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ ముగ్గురూ కూడా అండర్సన్ బౌలింగ్‌లోనే, కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఒకే విధంగా పెవిలియన్ చేరడం విశేషం...
77
12 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 43 బంతులు ఆడిన రోహిత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి, క్రీజులో కుదురుకోవడానకే ప్రాధాన్యం ఇస్తున్నాడు...