రోహిత్, విరాట్, ఎమ్మెస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, బుమ్రా... క్రిస్ మోరిస్ ఆల్‌టైం టీ20 ఎలెవన్‌లో...

Published : Dec 16, 2021, 11:33 AM IST

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌, ఇప్పటిదాకా ఐపీఎల్‌లో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2021 వేలంలో రూ.16.25 కోట్లు దక్కించుకున్న క్రిస్ మోరిస్, రాజస్థాన్ రాయల్స్‌కి ఓ మ్యాచ్‌లో విజయం అందించాడు. అయితే మిగిలిన మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

PREV
111
రోహిత్, విరాట్, ఎమ్మెస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, బుమ్రా... క్రిస్ మోరిస్ ఆల్‌టైం టీ20 ఎలెవన్‌లో...

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఆడిన క్రిస్ మోరిస్, 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి, బ్యాటుతో 67 పరుగులు చేశాడు...

211

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో సంజూ శాంసన్, జోస్ బట్లర్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ను అట్టిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్, క్రిస్ మోరిస్‌ను వేలానికి విడుదల చేసింది...

311

తాజాగా సఫారీ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, ఆల్‌టైం బెస్ట్ టీ20 ఎలెవన్ టీమ్‌ను ప్రకటించాడు. మోరిస్ టీమ్‌లో ఏకంగా ఐదుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కడం విశేషం...

411

టీ20ల్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు దక్కించుకున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో పాటు మరో ఓపెనర్‌గా భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు చోటు కల్పించాడు క్రిస్ మోరిస్...

511

సఫారీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్‌ను వన్ డౌన్ ప్లేయర్‌గా ఎంచుకున్న క్రిస్ మోరిస్, అతని ఆత్మీయ స్నేహితుడు విరాట్ కోహ్లీని టూ డౌన్ ప్లేయర్‌గా ఎంపిక చేశాడు...

611

విండీస్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్‌ను ఐదో స్థానం బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్న మోరిస్, భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా తన ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌లో ప్లేస్ కల్పించాడు...

711

భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి క్రిస్ మోరిస్ ఆల్‌టైం టీ20 ఎలెవన్‌లో చోటు దక్కింది. 49 టీ20 మ్యాచులు ఆడిన హార్ధిక్ పాడ్యా, 42 వికెట్లతో పాటు 484 పరుగులు చేశాడు. అయితే పాండ్యాకి ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం...

811

విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌కి క్రిస్ మోరిస్ ఆల్‌టైం టీ20 ఎలెవన్‌లో చోటు దక్కింది. 51 టీ20 మ్యాచులాడిన సునీల్ నరైన్, 155 పరుగులతో పాటు 52 వికెట్లు తీశాడు...

911

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు శ్రీలంక ఫాస్ట్ స్టార్ లసిత్ మలింగకి క్రిస్ మోరిస్ ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌లో చోటు దక్కింది. బుమ్రా 51 టీ20ల్లో 61 వికెట్లు తీయగా మలింగ 84 టీ20 మ్యాచుల్లో 107 వికెట్లు తీశాడు...

1011

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి కూడా క్రిస్ మోరిస్, ఆల్‌టైం బెస్ట్ టీ20 ఎలెవన్‌లో చోటు దక్కింది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ తీసిన బ్రెట్ లీ, తన కెరీర్‌లో 25 టీ20 మ్యాచులాడి 25 వికెట్లు మాత్రమే తీశాడు...

1111

క్రిస్ మోరిస్ ఆల్‌టైం టీ20 ఎలెవన్: రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, కిరన్ పోలార్డ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), సునీల్ నరైన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ, బ్రెట్ లీ

Read more Photos on
click me!

Recommended Stories