అతని బ్యాటింగ్ చూస్తుంటే హషీమ్ ఆమ్లా గుర్తుకువచ్చాడు... సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు...

First Published Jan 8, 2022, 5:56 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌, భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలకు ఆఖరి అవకాశం అని ప్రచారం నడిచింది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయిన ఈ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలతో రాణించారు...

తొలి ఇన్నింగ్స్‌లో 33 బంతులాడిన ఛతేశ్వర్ పూజారా 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, అజింకా రహానే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి టెస్టులో పూజారా గోల్డెన్ డకౌట్ కావడం విశేషం...

Rahane-Pujara

రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ స్వల్ప స్కోర్లకే అవుట్ కావడంతో 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా కలిసి 111 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు...

ఛతేశ్వర్ పూజారా 86 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేస్తే, అజింకా రహానే 78 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు... ఈ ఇద్దరూ తన స్టైల్‌కి విరుద్ధంగా బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు రాబట్టడం మరో విశేషం...

Cheteshwar Pujara

ఆరంభంలో ధాటిగా ఆడుతూ బౌండరీలు రాబట్టిన ఛతేశ్వర్ పూజారా, 40 పరుగులు దాటిన తర్వాత మళ్లీ తన పాత స్టైల్‌లో డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు... 

Cheteshwar Pujara

‘పరిస్థితులను తగ్గట్టుగా బ్యాటింగ్ స్టైల్‌ని మార్చుకునే ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వంటి ప్లేయర్లు దొరకడం చాలా అదృష్టం... ముఖ్యంగా పూజారా బ్యాటింగ్ చూసి షాక్ అయ్యా...

పూజారా బ్యాటింగ్ చూస్తుంటే హషీమ్ ఆమ్లా గుర్తుకువచ్చాడు. అతను చాలా నెమ్మదిగా ఆడతాడని, డిఫెన్స్ ఎక్కువగా ఆడతారని అనుకుంటారు. అయితే అతనిలో దూకుడుగా ఆడే బ్యాటర్ కూడా ఉన్నాడని చూపించాడు పూజారా...

ఇలా అవసరమైతే గేర్ మార్చి, బౌండరీలు బాదగల బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా... డ్రెస్సింగ్ రూమ్‌లో పూజారా లాంటి ప్లేయర్ ఉండడం టీమిండియా అదృష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

Cheteshwar Pujara

తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్లకే అవుటైన తర్వాత ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయలేకపోతే, ఇక కెరీర్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

Rahane-Pujara

‘తొలి ఇన్నింగ్స్‌లో పూజారా, రహానే ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. గత ఏడాదిగా ఈ ఇద్దరూ సరైన ఫామ్‌లో లేరు. శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి లాంటి ప్లేయర్లు తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు....

Cheteshwar Pujara , Ajinkya Rahane

ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ కెరీర్‌ను కాపాడుకోవాలంటే రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ పరుగులు చేయాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

click me!