వెన్నుముకలాంటోడిని తీసేశారు! మిగిలిన ఎముకల గూడు ఎలా నిలబడుతుంది... పూజారాపై హర్భజన్ సింగ్

Published : Jun 24, 2023, 01:43 PM IST

మానవ శరీరంలో 206 ఎముకలు ఉన్నా, అన్నింటినీ నిటారుగా నిలబెట్టేది వెన్నెముకే. వెన్నుపూస దెబ్బ తింటే, మనిషి కృంగిపోతాడు, పూర్తిగా వంగిపోతాడు... ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా లేని టీమ్ కూడా అలాంటిదే అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

PREV
16
వెన్నుముకలాంటోడిని తీసేశారు! మిగిలిన ఎముకల గూడు ఎలా నిలబడుతుంది... పూజారాపై హర్భజన్ సింగ్
Cheteshwar Pujara

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఫెయిల్ అయిన ఛతేశ్వర్ పూజారాతో పాటు ఉమేశ్ యాదవ్‌, మహ్మద్ షమీలకు కూడా వెస్టిండీస్ టూర్‌లో అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు. ఇందులో షమీకి రెస్ట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంటే మిగిలిన ఇద్దరినీ తప్పించారు..

26

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు టెస్టు టీమ్‌లో చోటు కల్పించిన సెలక్టర్లు, సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారాని టీమ్ నుంచి తప్పించారు. అందరి ఫెయిల్యూర్‌కి పూజారాని బలిపశువుని చేశారని సునీల్ గవాస్కర్ అంటే, హర్భజన్ సింగ్ కూడా ఇదే విధంగా స్పందించాడు..

36
Cheteshwar Pujara

‘వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. టీమిండియాకి అతను కీ ప్లేయర్. టీమ్‌కి పూజారా వెన్నెముక లాంటోడు...

46
Cheteshwar Pujara

పూజారాని తప్పిస్తే ఆ ప్రభావం టీమ్‌పై తీవ్రంగా పడుతుంది. వెన్నెముక లేకుండా మిగిలిన ఎముకల గూడు ఎలా నిలబడుతుంది. అయినా మిగిలిన బ్యాటర్ల యావరేజ్ కూడా ఏటికేటికీ పడిపోతోంది. టీమ్‌లో అందరికీ సమాన న్యాయం దక్కాలి..

56

బెంచ్ మార్కు దాటకపోతే ఎంత పెద్ద ప్లేయర్‌ని అయినా తప్పించాల్సిందే. అది కెప్టెన్ రోహిత్ శర్మ అయినా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా...

66
Rishabh Pant-Pujara

అప్పుడే మిగిలిన ప్లేయర్లకు బాగా ఆడాలనే బాధ్యత, భయం పెరుగుతాయి..  ఛతేశ్వర్ పూజారాకి ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చి ఉంటారు కానీ పూర్తిగా తప్పించి ఉండరనే అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. 

click me!

Recommended Stories