ఏడేళ్ల తర్వాత ఐపీఎల్ ఎంట్రీపై పూజారా కామెంట్... ధోనీ కెప్టెన్సీలో అదరగొడతానంటూ...

First Published Feb 20, 2021, 2:01 PM IST

టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, టెస్టుల్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌కి ‘వెన్నెముక’గా మారిన ఛతేశ్వర్ పూజారా, ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెన్స్ కింగ్ పూజారా కోసం రూ.50 లక్షలు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది చెన్నై సూపర్ కింగ్స్. 

గత ఏడాది ప్రదర్శనతో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సీఎస్‌కే, ఈ ఏడాది కూడా అదే టైపులో ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం విశేషం...
undefined
టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ పూజారాతో పాటు మొయిన్ ఆలీ, 32 ఏళ్ల కృష్ణప్ప గౌతమ్ వంటి ప్లేయర్ల కోసం భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది సీఎస్‌కే...
undefined
2008 నుంచి 10దాకా కేకేఆర్‌కి ఆడిన పూజారా, 2011 నుంచి 13 వరకూ రాయల్ ఛాలెంజర్స్‌కి ఆడాడు. 2014లో చివరిగా పంజాబ్ తరుపున ఆడిన పూజారా, ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...
undefined
ఆస్ట్రేలియా వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోగా, పూజారాను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పూజారా మాత్రం తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్నాడు...
undefined
‘ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాహీ భాయ్ కెప్టెన్సీలో ఆడేందుకు ఆశగా ఎదురు చూస్తున్నా... నేను మొదటి టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు, ధోనీయే టీమిండియాకు కెప్టెన్...
undefined
మహీ భాయ్‌తో కలిసి ఆడినప్పుడు ఎన్నో మరిచిపోలేని అనుభవాలున్నాయి. ఐపీఎల్ ఆడాలంటే మైండ్ సెట్ పూర్తిగా మారిపోవాలి. టెస్టు క్రికెట్ నుంచి ఐపీఎల్‌లోకి మైండ్ సెట్ వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది...
undefined
ఈసారి నేను నా మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చుకుని, ఐపీఎల్‌కి సిద్ధం అవ్వాలని అనుకుంటున్నా... విజిల్ పోడు...’ అంటూ వీడియో సందేశం ఇచ్చాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
ఇప్పటిదాకా 30 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా, 390 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. అయితే ఇది కేవలం 29 బంతుల్లోనే సాధించాడు పూజారా...
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో 50 బంతులు పూర్తి చేసుకోవడానికి 190+ పైగా బంతులు ఎదుర్కొన్నాడు ఛతేశ్వర్ పూజారా. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో అయితే డబుల్ డిజిట్ స్కోరు అందుకునేందుకే 100కి పైగా బంతులు వాడాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత జట్టు తరుపున వైట్ బాల్ క్రికెట్ ఆడాలని ఆశపడుతున్నట్టు మనసులో మాట బయటపెట్టిన పూజారా, ఐపీఎల్‌లో ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పూజారా ఐపీఎల్‌లో అదరగొడితే, భారత జట్టు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
undefined
click me!