ఐపీఎల్ ఫైనల్‌కు రావాలని బంగ్లా, ఆఫ్గాన్, శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్స్‌కు ఆహ్వానం.. ఆసియా కప్‌పై ప్రకటన!

Published : May 25, 2023, 03:37 PM IST

Asia Cup 2023: ఆసియా కప్ - 2023 నిర్వహణపై  సందిగ్దం కొనసాగుతున్న వేళ   ఐపీఎల్ ఫైనల్ తేదీన దీనిపై స్పష్టత రానున్నదా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. 

PREV
15
ఐపీఎల్ ఫైనల్‌కు రావాలని బంగ్లా, ఆఫ్గాన్, శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్స్‌కు ఆహ్వానం..  ఆసియా కప్‌పై ప్రకటన!
এশিয়া কাপে ভারত বনাম পাকিস্তান মহারণ, কোন দল করবে বাজিমাত, কী বলছে ম্যাচ প্রেডিকশন

సుమారు 8 నెలల కాలంగా కొనసా...గుతున్న   ఆసియా కప్ నిర్వహణ వివాదానికి త్వరలోనే  తెరపడనుందా..? ఈ టోర్నీని  పాకిస్తాన్ లేదా శ్రీలంకలలో  నిర్వహించే అంశంపై  క్లారిటీ రానుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.   ఐపీఎల్ - 16 ఫైనల్  ఇందుకు వేదిక కానుంది. 

25

ఐపీఎల్ - 2023 ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ కు రావాలని  భారత క్రికెట్ నియంత్రణ మండలి.. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ),  అఫ్గానిస్తాన్  క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధిపతులకు  ఆహ్వానం పంపింది.   మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. 

35

ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా కూడా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.  బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, శ్రీలంక కు చెందిన క్రికెట్ బోర్డుల ప్రతినిధులు  ఐపీఎల్ - 16 ఫైనల్ కు  వస్తారని  ఆసియా కప్ భవితవ్యం మీద  ఇక్కడ ఓ నిర్ణయానికి  వచ్చే అవకాశం ఉందని   ట్వీట్  చేయడం గమనార్హం. 

45

రెండు నెలల క్రితం  ఆసియాకప్   ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు అంగీకరించిన ఏసీసీ..  భారత్ తో జరిగే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికపై   జరిపించాలని  నిర్ణయించినట్ట వార్తలు వచ్చాయి. కానీ   ఉన్నట్టుండీ ఈ టోర్నీని శ్రీలంకకు తరలిస్తున్నారని.. అలా అయితే తాము ఆసియా కప్ ను  బహిష్కరిస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగినట్టూ పుకార్లు  షికార్లు చేశాయి. 

55

అయితే తాజాగా.. పీసీబీ హైబ్రిడ్ మోడల్ కు బీసీసీఐకి అంగీకారం తెలిపిందన్న వార్తలపై  కూడా  బోర్డు  ప్రతినిధులు  కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని.. ఐపీఎల్ ఫైనల్ కు మూడు దేశాల క్రికెట్ బోర్డుల అధిపతులు వచ్చిన తర్వాత నిర్వహించే సమావేశంలో అన్ని వివరాలు వెల్లడవుతాయని  తెలిపారు.  

click me!

Recommended Stories