‘విరాట్, నిజంగా చాలా గొప్ప కెప్టెన్‌వి, కానీ ఐసీసీ టైటిల్స్ గెలవకపోతే జనాలు నిన్ను ఎక్కువకాలం గుర్తుపెట్టుకోరు..
నిజం చెప్పాలంటే ఫైనల్ మ్యాచ్‌లో కూడా నీ ప్లాన్స్ బాగున్నాయి. కానీ బౌలర్లు ఆ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోరారు. నీ వైపు అదృష్టం కూడా లేకపోయింది...
ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. ఐపీఎల్ టైటిల్ కూడా... అతను టాప్ క్లాస్ క్రికెటర్...
అతనికి అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అతని ఎనర్జీ అసామాన్యం...
అతని ఎనర్జీడిఫరెంట్ లెవెల్. ప్రతీసారి క్రీజులోకి వచ్చినప్పుడు బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు...
అయితే నా ఉద్దేశంలో కెప్టెన్ అనేవాడు ఎప్పుడూ కూల్‌గా ఉండాలి. అంతేకాని మండే నిప్పులా కాదు... డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు మనం ఇది ఫైర్ వర్సెస్ ఐస్ పోటీగా వింటూనే ఉన్నాం...
చరిత్రలో అనేక టైటిల్స్ సాధించిన కెప్టెన్లు అందరూ కూల్ యాటిట్యూడ్‌తో జనాల మనసులు గెలుచుకున్నవారే...
విరాట్ కోహ్లీ ఓ హవభావాలు పలికించే వ్యక్తి. అతను ఏది ఫీల్ అయినా అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కోహ్లీ టైటిల్ గెలిస్తే చూడాలనేది నా కోరిక కూడా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...