IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)..మరోసారి కప్ కొడుతుందా లేక 2016 సెంటిమెంట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ అడ్డుపడుతుందా? ఎవరికి ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో దంచికొట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) డైరెక్ట్‌గా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో రజత్ పాటీదార్ కెప్టెన్సీలోని బెంగళూరు టీమ్ ఊహించని రేంజ్‌లో చెలరేగింది. దీంతో మే 31 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో అడుగుపెట్టిన ఫస్ట్ టీమ్‌గా ఆర్సీబీ హిస్టరీ క్రియేట్ చేసింది.
అయితే ఆర్సీబీ ఫైనల్ చేరగానే అభిమానులకు ఒక పాత భయం గుర్తొస్తోంది. ఈసారి కప్ కొడతారా లేక మళ్లీ హైదరాబాద్ టీమ్ అడ్డుపడుతుందా? అనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
25
80% లెక్కలు ఆర్సీబీ వైపే.. వరుసగా రెండోసారి కప్?
ఐపీఎల్ రికార్డులను గమనిస్తే ఈసారి కూడా టైటిల్ గెలిచే ఛాన్స్ ఆర్సీబీకే ఎక్కువగా కనిపిస్తోంది. 2011లో ప్లేఆఫ్స్ రూల్స్ స్టార్ట్ అయినప్పటి నుండి జరిగిన 15 సీజన్లలో.. ఏకంగా 12 సార్లు అంటే 80 శాతం క్వాలిఫైయర్ 1 గెలిచిన టీమే ఫైనల్‌లో కూడా గెలిచి కప్ కొట్టింది.
గడిచిన 7 సీజన్లుగా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. లాస్ట్ సీజన్‌లో ఫస్ట్ టైమ్ టైటిల్ కొట్టిన ఆర్సీబీ.. ఇప్పుడు రజత్ పాటీదార్ లీడర్‌షిప్‌లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవ్వడానికి 80 శాతం అవకాశాలు ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే చెన్నై (CSK), ముంబై (MI) తర్వాత టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న మూడో టీమ్‌గా బెంగళూరు నిలుస్తుంది.
35
ఆర్సీబీని భయపెడుతున్న 2016 నాటి సీన్
లెక్కలన్నీ ఆర్సీబీకి పాజిటివ్‌గా ఉన్నా.. బెంగళూరు అభిమానులను టెన్షన్ పెడుతున్న ఒకే ఒక్క బ్యాడ్ రికార్డు ఉంది. అదే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచి కూడా ఫైనల్‌లో ఓడిపోవడం. ఐపీఎల్ హిస్టరీలో అలా క్వాలిఫైయర్ 1 గెలిచి ఫైనల్లో బోల్తా పడిన మూడు టీమ్స్‌లో ఆర్సీబీ కూడా ఒకటి.
కరెక్ట్‌గా పదేళ్ల క్రితం, అంటే 2016 సీజన్‌లో క్వాలిఫైయర్ 1 గెలిచిన బెంగళూరును ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓడించి కప్ కొట్టేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి టైటిల్ నెగ్గిన ఏకైక టీమ్ సన్‌రైజర్స్ మాత్రమే.
ఇప్పుడు అభిమానులకు అస్సలు నిద్రపట్టకుండా చేస్తున్న కోఇన్సిడెన్స్ ఏంటంటే.. ఈసారి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతోంది. ఆర్సీబీ ఏమో అప్పుడే డైరెక్ట్‌గా ఫైనల్‌లో వెయిట్ చేస్తోంది.
ఒకవేళ సన్‌రైజర్స్ కనుక క్వాలిఫైయర్ 2 దాటుకుని ఫైనల్‌కు వస్తే.. మళ్లీ 2016 నాటి ఫైనల్ సీన్ రిపీట్ అవుతుందా? హైదరాబాద్ మళ్లీ ఆర్సీబీ నోటి కాడి కూడును లాగేస్తుందా? అని ఆర్సీబీ అభిమానులు టెన్షన్‌లో ఉన్నారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మే 29 శుక్రవారం న్యూ చండీగఢ్‌లో జరగనుంది.
55
ఫైనల్ ఎవరితో ఉన్నా ఆర్సీబీ తగ్గేదేలే
మరోవైపు ఆర్సీబీ టీమ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో టీమ్ అంతా పక్కా ప్లానింగ్‌తో ఆడుతోంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లేదా రాజస్థాన్ రాయల్స్.. ఇలా ఏ టీమ్ వచ్చినా సరే ఢీ కొట్టేందుకు బెంగళూరు రెడీగా ఉంది.
గత సీజన్ విన్నర్స్ కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ ఈసారి ఫైనల్‌లో బాగా ప్లస్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈసారైనా ఆర్సీబీ పాత భయాలను వీడి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.