వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా స్వదేశంలో ఘనమైన రికార్డు ఉండడమే టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా మారేందుకు కారణం. రికీ పాంటింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి మాజీలు కూడా ఇండియా, వరల్డ్ కప్ ఫెవరెట్ అంటూ కామెంట్ చేశారు..
2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, ఈసారి మరోసారి కప్పు గెలుస్తుందని అంటున్నారు మాజీ క్రికెటర్లు. అయితే ఇలా చెప్పడం వెనక చాలా పెద్ద స్ట్రాటెజీయే ఉందంటున్నాడు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..
27
Ravichandran Ashwin
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చి తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌లో ఆడాడు. అక్కడికి రాగానే తమిళనాడులో జిల్లా క్రికెట్ టోర్నీలో ఆడుతున్నాడు..
37
‘క్రికెట్ ప్రపంచంలో చాలా మంది సీనియర్లు, ఇండియా ఫెవరెట్స్ అని చెబుతున్నారు. ఇప్పుడు కాదు, వరల్డ్ కప్ వచ్చిన ప్రతీసారీ టీమిండియా, టైటిల్ ఫెవరెట్‌గానే ఉంటోంది. దీని వెనక ఓ రకమైన స్ట్రాటెజీ ఉంది..
47
భారత జట్టును ఫెవరెట్, ఫెవరెట్ అని ప్లేయర్లపై తీవ్రమైన ప్రెషర్ పెంచుతున్నారు. ఫెవరెట్స్‌గా బరిలో దిగడం వల్ల టీమ్‌పై ప్రెషర్ రెట్టింపు అవుతుంది...
57
ఆస్ట్రేలియా ఓ పవర్ హౌజ్. వాళ్లు టైటిల్ ఫెవరెట్స్‌గా కచ్ఛితంగా ఉంటారు. బార్బోడాస్‌లో రెండో వన్డే ఓటమి గురించి చాలా చర్చ జరిగింది. వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది..
67
ఒకటి రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన పోయేదేమీ లేదు. అయితే క్రికెట్ ఫ్యాన్స్, టీమ్ నుంచి చాలా ఆశిస్తారు. ఆశించిన పర్ఫామెన్స్ రాకపోతే ఆ కోపాన్ని టీమ్‌పైన చూపిస్తారు. అయితే ఇలాంటి సమయాల్లోనే టీమ్‌కి సపోర్ట్ అవసరం..
77
Ravichandran Ashwin
ఒక్కటి మాత్రం నిజం, ఈసారి వరల్డ్ కప్ మనమే పెడుతున్నాం, మన దగ్గర జరుగుతున్న టోర్నీ.. కాబట్టి మన టీమ్‌కి మన సపోర్ట్ ఇచ్చే ఎనర్జీ మరేదీ ఇవ్వదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..