సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మహిరా, సిరాజ్‌ల అభిమానులు ఆశ్చర్యం, ఉత్సాహం, ఉత్సుకతతో కామెంటట్స్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఊహించని ఈ జంటపై థ్రిల్‌గా ఉన్నారు.. అలాగే, వారిని "పవర్ కపుల్" అని పిలుస్తున్నారు. “మహీరా,సిరాజ్ కలిసి రావడాన్ని చూడలేదు, కానీ నిజమైతే, వారు కలిసి అద్భుతంగా కనిపిస్తారు!, “రియాలిటీ టీవీ నుండి క్రికెట్ వరకు-ఇది ఆసక్తికరమైన మ్యాచ్!” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పరాస్ ఛబ్రాతో ప్రేమలో ఉన్న బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ మహిరా శర్మ, ఇప్పుడు క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలపై సిరాజ్ కానీ, మహిరా కానీ స్పందించలేదు. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళ సంబంధాన్ని వెల్లడించింది, కానీ వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు ఒకరినొకరు తెలుసుకుంటున్నారట. సిరాజ్ 2024లో మహిరా ఫోటోకి లైక్ కొట్టాడని, అందుకే ఈ వార్తలు వచ్చాయని తెలిసింది, కానీ ఆ లైక్ ఇప్పుడు కనిపించట్లేదు.