వెంటనే ఆయన్ని ఆస్ట్రేలియాకి పంపించండి... భారతజట్టును కాపాడే సత్తా అతనికి మాత్రమే ఉంది...

First Published Dec 20, 2020, 12:04 PM IST

భారత క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించని ఘోరమైన ప్రదర్శనను కనబర్చింది టీమిండియా. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై, ఈ దశాబ్దంలోనే చెత్త రికార్డు నమోదుచేసింది. ‘ఈతరం ద్రావిడ్’గా పేరొందిన పూజారా నుంచి టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అజింకా రహానే, హనుమ విహారి దాకా 11 మంది బ్యాట్స్‌మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

ఆస్ట్రేలియా పిచ్‌లపై పెద్దగా అనుభవం లేని పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ తొందరగా అవుట్ అవ్వడం పెద్దగా విశేషమేమీ కాదు, కానీ ‘మోడ్రన్ వాల్’గా గుర్తింపు తెచ్చుకున్న పూజారా డకౌట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
ఆస్ట్రేలియా పిచ్‌లపై పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీని 4 పరుగులకే పెవిలియన్ చేర్చిన ఆస్ట్రేలియా... వైస్ కెప్టెన్ అజింకా రహానేను కూడా డకౌట్ చేసింది...
undefined
టెస్టుల్లో మోస్ట్ టాలెండెట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హనుమ విహారి కూడా 8 పరుగులు చేసి పెవిలయన్ చేరాడు. వీరిలో పూజారా, హనుమ విహారి కొన్ని నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నారు.
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో పూజారా 160 బంతులు ఎదుర్కొన్నా, తన క్లాస్ టచ్‌ను అందుకోలేకపోయాడు. దీనికి కారణం సరైన కోచ్ లేకపోవడమే అని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
టీమిండియా మిగిలిన మూడు టెస్టుల్లో అయినా సరిగా రాణించాలంటే, బీసీసీఐ వెంటనే రాహుల్ ద్రావిడ్‌ను ఆస్ట్రేలియాకు పంపించాలని కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్.
undefined
‘బీసీసీఐ వెంటనే రాహుల్ ద్రావిడ్‌ను భారత జట్టుకు సాయం చేసేందుకు ఆస్ట్రేలియాకు పంపించాలి. ఈ పరిస్థితుల్లో ద్రావిడ్ ఒక్కడే, ఆస్ట్రేలియా పిచ్‌లపై బంతిని ఎలా ఎదుర్కోవాలో బ్యాట్స్‌మెన్‌ను అర్థమయ్యేలా చెప్పగలడు..
undefined
నెట్స్‌లో రాహుల్ ద్రావిడ్ అంటే అది భారత జట్టుకు మంచి బూస్ట్‌ని ఇస్తుంది. కోవిద్ కారణంగా ఎన్‌సీఏకి గత 9 నెలలుగా తాళం వేసి ఉంచారు...
undefined
ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి నేరుగా వచ్చింది భారత జట్టు. అలాకాకుండా రాహుల్ ద్రావిడ్ సమక్షంలో ఎన్‌సీఏలో క్రికెటర్లు శిక్షణ తీసుకుంటే ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేది...
undefined
రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెట్ లెజెండ్‌ సేవలను బీసీసీఐ సరిగా ఉపయోగించుకోవాలి. విరాట్ కోహ్లీ లేని భారత జట్టుకి ద్రావిడ్ ఎంతగానో ఉపయోగపడతాడు...’ అంటూ వ్యాఖ్యానించాడు దిలీప్ వెంగ్ సర్కార్.
undefined
ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి అయినా సిడ్నీలో జరిగే మూడో టెస్టు నాటికి నెట్స్‌లో రాహుల్ ద్రావిడ్ అందుబాటులో ఉంటాడని చెప్పాడు మాజీ కెప్టెన్...
undefined
2003 ఆస్ట్రేలియా సిరీస్‌లో ఇదే ఆడిలైడ్‌లో జరిగిన టెస్టులో 233 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, నాలుగో ఇన్నింగ్స్‌లో అజేయంగా 72 పరుగులు చేసి టీమిండియాకి విజయాన్ని అందించాడు...
undefined
మొత్తం ఆస్ట్రేలియాలో 16 టెస్టులు ఆడిన రాహుల్ ద్రావిడ్, 41.64 సగటుతో 1166 పరుగులు సాధించాడు.
undefined
click me!