చిన్న చిన్న తప్పులు... భారీ మూల్యం... పింక్ బాల్ టెస్టులో ఈ మార్పులు చేసి ఉంటేనా...

First Published Dec 19, 2020, 4:39 PM IST

పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు 6 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. అయితే రెండో రోజు ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, ఆతిథ్య జట్టుకి ఊహంచని షాక్ ఇచ్చింది టీమిండియా. ఆధిక్యం దక్కింది, ఎంత లేదన్నా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసినా టీమిండియా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా... కానీ ఆసీస్ బౌలర్ల ప్లాన్ వేరేగా ఉంది...

36 పరుగులకే టీమిండియాను కట్టడి చేసిన ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్‌వుడ్... విరాట్ కోహ్లీ అండ్ టీమ్‌ ఓవర్ కాన్ఫిడెన్స్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు...
undefined
అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ అండ్ టీమ్ చేసిన చిన్ని చిన్ని తప్పులే భారీ మూల్యం చెల్లించడానికి కారణమయ్యాయంటున్నారని క్రికెట్ విశ్లేషకులు...
undefined
పృథ్వీషా ఎంపిక... ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచుల్లో ఫెయిల్ అయిన పృథ్వీషాను ఎంపిక చేయడం భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది...
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే అవుటైన పృథ్వీషా... మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారాలను ఒత్తిడిలోకి నెట్టేశాడు...
undefined
విరాట్ కోహ్లీ రనౌట్... 180 బంతులు అంటే 30 ఓవర్ల పాటు ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ రనౌట్ కావడం టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టేసింది...
undefined
74 పరుగులు చేసిన కోహ్లీ, తన కారణంగా రనౌట్ అయ్యాడనే భావన అజింకా రహానేను ఎక్కువసేపు క్రీజులో నిలవనివ్వలేదు... రహానేతో పాటే మిగిలిన ఏడు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది టీమిండియా...
undefined
చెత్త ఫీల్డింగ్... ఓపెనర్లు ఇద్దరు అవుటైన తర్వాత లబుషేన్ 47 పరుగులతో రాణించాడు. లబుషేన్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచులు నేలవిడవడం ఆసీస్‌కి బాగా కలిసొచ్చింది...లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు పృథ్వీషా..
undefined
టిమ్ పైన్ క్యాచ్ డ్రాప్... 73 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఆసీస్ కెప్టెన్, ఇన్నింగ్స్ ఆరంభంలో ఇచ్చిన క్యాచ్‌ను మయాంక్ అగర్వాల్ జారవిడిచాడు. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంది భారత జట్టు...
undefined
భారత ఫీల్డర్లు చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలపాలు చేస్తే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌లో అద్భుతాలే చేసింది. బంతి, బ్యాటు అంచుకి తగిలితే చాలు, ఫీల్డర్ చేతుల్లోకి వచ్చి వాలింది..
undefined
కెఎల్ రాహుల్ లేదా శుబ్‌మన్ గిల్ ఉండి ఉంటే... పృథ్వీషా స్థానంలో అనుభవం ఉన్న కెఎల్ రాహుల్ ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. రెండో రోజు భారత జట్టు ఆడింది 9 ఓవర్లే...
undefined
9 ఓవర్ల పాటు వికెట్‌ని కాపాడుకుని ఉంటే... ఆస్ట్రేలియా బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లేవారు. కానీ పృథ్వీషా మాత్రం అదే నిర్లక్ష్యంతో మరోసారి ఆసీస్‌కి వికెట్ సమర్పించుకున్నాడు...
undefined
నైట్‌వాచ్‌మెన్ బుమ్రా... పృథ్వీషా వికెట్ కోల్పోయిన తర్వాత నైట్‌వాచ్‌మెన్‌గా బుమ్రాని పంపింది టీమిండియా. బుమ్రా తన కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించాడు.
undefined
అయితే మూడో రోజు ఆటలో ఇంత విధ్వంసం జరుగుతుందని ఏ జట్టూ ఊహించదు. నేడుటీమిండియా కోల్పోయిన మొదటి వికెట్ బుమ్రానే... బుమ్రాకి బదులుగా వన్‌డౌన్‌లో పూజారానే బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే... బౌలింగ్‌ని అర్థం చేసుకునేందుకు సమయం దొరికేది...
undefined
టెయిల్... 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు, చివరి మూడు వికెట్లకు 80 పరుగులు జోడించింది... టెయిలెండర్లు జోడించిన ఈ అమూల్యమైన పరుగులు జట్టు విజయానికి చాలా ఉపయోగపడ్డాయి.
undefined
భారత టెయిల్... ఆస్ట్రేలియా టెయిలెండర్లు బ్యాటింగ్‌లోనూ రాణించి, కష్టాల్లో ఉన్న జట్టుకి విలువైన పరుగులు జోడిస్తే, భారత టెయిలెండర్లు ఏ మాత్రం పరుగులు చేయలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇరుజట్లకీ ఉన్న ఈ తేడాయే విజయాన్ని దూరం చేసింది.
undefined
click me!