ఒకేసారి అటు ఇంగ్లాండ్‌తో టెస్టులు, ఇటు శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్... బీసీసీఐ మాస్టర్ ప్లాన్...

First Published May 10, 2021, 8:57 AM IST

ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఢీలా పడిన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది బీసీసీఐ. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఆసియా కప్ వాయిదాపడినా, ముందుగా అనుకున్నట్టుగానే ఒకేసారి టీమిండియా రెండు చోట్ల రెండు వేర్వేరు సిరీస్‌లు ఆడనుంది.

వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్తున్న టీమిండయా అక్కడే, ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచులు టెస్టు సిరీస్ కూడా ఆడనుంది.
undefined
ఆగస్టు 4న ఆరంభమయ్యే ఈ టెస్టు సిరీస్‌, సెప్టెంబర్ 14 వరకూ కొనసాగుతుంది. అయితే ఇదే సమయంలో మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ఇంగ్లాండ్‌తో టెస్టులు ఆడుతుంటే, ఇక్కడ యువకులతో కూడిన రెండో జట్టు వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది.
undefined
ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకోని ఆటగాళ్లను శ్రీలంక పర్యటనను పంపబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ.
undefined
ఈ టూర్‌లో టీమిండియా 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడనుంది..జూలై 4న ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి రానుంది శ్రీలంక. ఆ తర్వాత భారత జట్టుతో సిరీస్ ఆరంభం అవుతుంది...
undefined
‘భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. అయితే ఇది పూర్తిగా వేరే జట్టు. ఇందులో అందరూ వైట్ బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్లు ఉంటారు’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ...
undefined
ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లే జట్టులో చోటు దక్కించుకోని హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, నటరాజన్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, పృథ్వీషా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహార్, రాహుల్ చాహార్ వంటి ప్లేయర్లు శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
undefined
వీరితో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, దేవ్‌దత్ పడిక్కల్, శిఖర్ ధావన్, మనీశ్ పాండే... ఇలా టీమిండియా దగ్గర కావాల్సినంత మంది ప్లేయర్లతో రెండో జట్టు రెఢీగా ఉంది.
undefined
విరాట్ కోహ్లీ లేకపోతే టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహారించే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కూడా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు కూడా.
undefined
దీంతో గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమైన శ్రేయాస్ అయ్యర్, జూలై నాటికి కోలుకునే అవకాశం ఉంది. అతనికి టీమిండియా రెండో జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.
undefined
ఒకవేళ అయ్యర్ ఆ సమయానికి సిద్ధంగా లేకపోతే శిఖర్ ధావన్, పృథ్వీషా, హార్ధిక్ పాండ్యాలలో ఒకరికి కెప్టెన్సీ దక్కేందుకు అవకాశం ఉంటుంది.
undefined
click me!