బుమ్రా ఇలాగే ఆడితే 400 టెస్టు వికెట్లు తీస్తాడు... విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు...

First Published May 9, 2021, 4:09 PM IST

విండీస్ మాజీ పేసర్ సర్ కర్ట్‌లీ అంబ్రోస్... భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాల పర్ఫామెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ మెయింటైన్‌ చేస్తూ ఇలాగే రాణిస్తే, టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టడం ఖాయమని జోస్యం చెప్పాడు అంబ్రోస్...

1980-2000 మధ్యకాలంలో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన వెస్టిండీస్ క్రికెట్ జట్టులో భీకరమైన ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అంబ్రోస్...
undefined
98 టెస్టుల్లో 405 వికెట్లు తీసిన అంబ్రోస్, 176 వన్డేల్లో 225 వికెట్లు పడగొట్టాడు. 6 అడుగుల 7 అంగుళాల పొడవైన అంబ్రోస్, పేస్, బౌన్స్ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టేవాడు.
undefined
‘ఇప్పుడు టీమిండియాలో మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా బుమ్రా... అతనికి నేను పెద్ద అభిమానిని. నేను చూసిన మిగిలిన బౌలర్ల కంటే బుమ్రా చాలా డిఫెరెంట్..
undefined
అతని యాక్షన్ చాలా ఎఫెక్టివ్. బుమ్రా మున్ముందు ఎలా రాణిస్తాడో అని చూడడానికి ఎదురుచూస్తున్నా. అతను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటే... లాంగ్ కెరీర్‌ కొనసాగించగలడు...
undefined
బంతితో సీమ్‌తో వేయగలడు, స్వింగ్ చేయగలడు, యార్కర్లు కూడా వేయగలడు... తన చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి... ఇలాగే కొనసాగిస్తే అతను కచ్ఛితంగా 400 టెస్టు వికెట్లు తీస్తాడు.
undefined
ఫాస్ట్ బౌలర్లకు రిథమ్ చాలా ముఖ్యం. బంతి వేయడానికి ముందు ఓ రిథమ్ క్రియేట్ చేసుకోగలగాలి. బుమ్రా కొద్ది దూరమే పరుగెడతాడు...
undefined
చాలాదూరం నడిచి, నాకు తెలిసి బంతి డెలివరీ చేసేముందు రెండు, మూడు జాగ్స్ వేస్తాడు. దీనివల్ల అతని శరీరంపై కొద్దిగా ఎక్కువ శ్రమ పడుతుంది. అతను దృఢంగా ఉంటే ఓకే, లేదంటే ఇది అతన్ని ఇబ్బందిపెట్టొచ్చు..’ అంటూ చెప్పుకొచ్చాడు అంబ్రోస్...
undefined
18 టెస్టుల్లో 83 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా... 15 టెస్టుల తర్వాత స్వదేశంలో తొలి టెస్టు ఆడాడు. 67 వన్డేల్లో 108 వికెట్లు తీసిన బుమ్రా, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కీలకం కానున్నాడు.
undefined
ఇప్పటిదాకా భారత జట్టు నుంచి కేవలం కపిల్‌దేవ్ మాత్రం 400+ వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్ 311 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోగా ఇషాంత్ శర్మ 303 వికెట్లతో ఉన్నాడు.
undefined
అలాగే తాను విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వీరాభిమానినని ప్రకటించాడు అంబ్రోస్. ‘నేను కోహ్లీ బ్యాటింగ్ స్టైల్‌కి పెద్ద ఫ్యాన్‌ని... అతను ఎక్కుడ ఆడుతుంటే, ఎంత చెల్లించి చూసేందుకైనా నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను’ అంటూ తెలిపాడు అంబ్రోస్.
undefined
click me!