బుమ్రా ఇప్పుడే వద్దు! శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరంగా పెట్టాలని భావిస్తున్న బీసీసీఐ...

Published : Jan 09, 2023, 02:29 PM IST

స్వదేశంలో టీమిండియాకి తిరుగులేని రికార్డు ఉంది. అంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అయినా ఇప్పుడు రోహిత్‌ శర్మతో పాటు మిగిలిన అరడజను కెప్టెన్ల కెప్టెన్సీలో అయినా స్వదేశంలో వరుస విజయాలు అందుకుంటోంది భారత జట్టు...

PREV
17
బుమ్రా ఇప్పుడే వద్దు! శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరంగా పెట్టాలని భావిస్తున్న బీసీసీఐ...

న్యూజిలాండ్ పర్యటనలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో, బంగ్లాదేశ్ పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. స్వదేశంలో శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గింది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపిన టీమిండియా... వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది...

27
Jasprit Bumrah

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. గాయం కారణంగా ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలకు దూరమైన జస్ప్రిత్ బుమ్రా... దాదాపు నాలుగు నెలల తర్వాత టీమిండియా తరుపున ఆరంగ్రేం చేయబోతున్నాడు...

37
Image credit: Getty

తొలుత వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో జస్ప్రిత్ బుమ్రా పేరు లేదు. గాయం నుంచి కోలుకుని, పూర్తి ఫిట్‌నెస్ సాధించిన బుమ్రా... వన్డే జట్టులో జత చేయబడ్డాడు. అయితే  బుమ్రాని వన్డే సిరీస్‌కి దూరంగా పెట్టాలని భావిస్తోందట బీసీసీఐ...

47
Image credit: Getty

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఈ రెండు సిరీస్‌ల తర్వాత ఆస్ట్రేలయాతో టెస్టు సిరీస్ ఉంటుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్ గెలవడం టీమిండియాకి చాలా అవసరం...

57
Image credit: Getty

ఆస్ట్రేలియాపై జస్ప్రిత్ బుమ్రాకి మంచి రికార్డు ఉంది. కాబట్టి బుమ్రాని టెస్టు సిరీస్‌కి సిద్ధంగా ఉంచేలా లంకతో వన్డే సిరీస్‌కి దూరం పెట్టాలని నిర్ణయానికి వచ్చిందట బీసీసీఐ. ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్‌లో బుమ్రాని తీసుకొచ్చాడు...

67
bumrah

అయితే గాయం తిరగబెట్టడంతో రెండు మ్యాచులు ఆడిన తర్వాత జస్ప్రిత్ బుమ్రా గాయం మళ్లీ తిరగబెట్టింది. దెబ్బకు టీ20 వరల్డ్ కప్ 2022 వంటి మెగా టోర్నీ బుమ్రా లేకుండా ఆడాల్సి వచ్చింది. ఈసారి అలాంటి తప్పు చేయకూడదని అనుకుంటోందట బీసీసీఐ...

77

అయితే శ్రీలంకతో సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రాని పక్కనబెట్టే నిర్ణయం వెనక ముంబై ఇండియన్స్ హస్తమేమీ లేదు కదా అని అనుమానిస్తున్నారు నెటిజన్లు. బుమ్రా మరోసారి గాయపడితే ఐపీఎల్ 2023 టోర్నీకి దూరమవుతాడని అతన్ని లంకతో సిరీస్ నుంచి తప్పించలేదు కదా... అని అనుమానిస్తున్నారు.. 

click me!

Recommended Stories