ఎంత పని చేశావయ్యా కృనాల్... పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ టూర్‌పై నీలినీడలు...

First Published | Jul 29, 2021, 4:43 PM IST

కృనాల్ పాండ్యా కరోనా పాజిటివ్‌‌గా తేలడం, లంక టూర్‌లో ఉన్న భారత జట్టుపైనే కాదు, కొందరు క్రికెటర్ల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.  ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ ఇంగ్లాండ్ టూర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి...

కరోనా పాజిటివ్‌గా తేలిన కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ కలిగి ఉండడం వల్ల పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లతో మరో పాటు ఆరుగురు క్రికెటర్లు క్వారంటైన్‌లో గడుపుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 9మంది ప్లేయర్లు జట్టుకి దూరం కావడంతో భారత జట్టు చాలా వీక్‌గా తయారైంది...
రెండో టీ20 మ్యాచ్‌లో కేవలం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లతో బరిలో దిగిన టీమిండియా, పోరాడి ఓడింది. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా వంటి బ్యాట్స్‌మెన్ టీమ్‌లో ఉండి ఉంటే, ఫలితం వేరేగా ఉండేది...

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్... కరోనా ప్రోటోకాల్ ప్రకారం 10 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉండాల్సి ఉంటుంది... ఆ తర్వాత కరోనా నెగిటివ్ రిజల్ట్ వస్తే, ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తారు...
ఇండియా, శ్రీలంక దేశాల నుంచి వచ్చేవాళ్లను ఇంగ్లాండ్ బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత కూడా మరో 10 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అంటే 20 రోజుల పాటు ఈ ఇద్దరూ జట్టుకి అందుబాటులో ఉండరు.
ఈ ఇద్దరి స్థానంలో వేరే ప్లేయర్లను ఇంగ్లాండ్ టూర్‌కి పంపిస్తే, వాళ్లు 10 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టుకి అందుబాటులో ఉంటారు. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్, ఈ విధంగా ఆలోచనలు చేస్తోందట...
ఇప్పటికిప్పుడు కొత్తవాళ్లను సెలక్ట్ చేసి, ఇంగ్లాండ్ టూర్‌కి పంపడం వీలుకాకపోవచ్చు. అయితే శ్రీలంక టూర్‌లో కృనాల్ పాండ్యాతో కలవని వారిలో ఉన్న భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ వంటి వాళ్లకి జట్టులో చోటు దక్కవచ్చు.
‘మేం ఇప్పుడే ఏం చెప్పలేం. అయితే మరో రెండు రోజుల పాటు పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తాం. ఆ తర్వాత ఈ ఇద్దరి ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌ తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటాం...’ అని తెలిపారు ఓ బీసీసీఐ అధికారి...
ఒకవేళ 20 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న తర్వాత పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను ఆడించాలని భావిస్తే... ఆఖరి రెండు టెస్టులకు మాత్రమే వీళ్లు అందుబాటులో ఉంటారు. ఈలోపు ఏ క్రికెటర్ గాయపడినా, జట్టు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు...
ఆస్ట్రేలియా‌లో ఆడిలైడ్ టెస్టులో ఘోరంగా ఫెయిల్ అయిన తర్వాత పృథ్వీషా... విజయ్ హాజారే ట్రోఫీ, ఐపీఎల్ 2021, వన్డే సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చి... టెస్టు సిరీస్‌కి కాల్ అందుకున్నాడు...
అలాగే నాలుగు సీజన్లుగా ముంబై ఇండియన్స్ తరుపున అదరగొడుతున్న భారత జట్టు నుంచి ఒక్క పిలుపు కోసం ఆశగా ఎదురుచూసిన సూర్యకుమార్ యాదవ్... ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు...
టెస్టు ఆరంగ్రేటం కోసం ఆశగా ఎదురుచూస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కీ, రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న పృథ్వీషా... కృనాల్ పాండ్యా రూపంలో బ్యాడ్‌లక్ షేక్ హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు అభిమానులు...

Latest Videos

click me!