ఒక్క రోజుకి రూ.60 వేలు... దేశవాళీ క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం...

Published : Sep 20, 2021, 07:56 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. జాతీయ జట్టు ప్లేయర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తున్న భారత క్రికెట్ బోర్డు, దేశవాళీ క్రికెటర్ల విషయంలో మాత్రం చాలా పొదుపుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉండేవి. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ లీగ్‌లు కూడా ఆగిపోవడంతో దేశవాళీ క్రికెటర్లు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది...

PREV
17
ఒక్క రోజుకి రూ.60 వేలు... దేశవాళీ క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం...

టీమిండియాకి ప్లేయర్లను అందించే దేశవాళీ టోర్నీలపై చిన్నచూపు చూపిస్తుందనే విమర్శలకు ఫుల్‌స్టాప్ పెడుతూ... 2020-21 సీజన్‌లో డొమెస్టిక్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజును 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. 

27

రంజీ ట్రోఫీలో తుదిజట్టులో చోటు దక్కించుకున్న ప్లేయర్లకి రోజుకి రూ.35 వేలు మ్యాచు ఫీజు రూపంలో చెల్లించేవారు... తుది జట్టులో చోటు దక్కించుకోకపోయినా, రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం రూ.17,500 అందుతుంది...

37

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడే ప్లేయర్లకు మ్యాచ్‌కి రూ.17,500 చెల్లిస్తారు. రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం చెల్లించేవారు. దీన్ని పెంచాలని సోమవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు... 

47

 బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం 40, అంతకంటే ఎక్కువ రంజీ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లకు రోజుకి రూ.60 వేలు చెల్లిస్తారు. అంటే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కి రూ.2.40 లక్షలు దేశవాళీ క్రికెటర్ల ఖాతాలో చేరుతుంది.

57

20 కంటే ఎక్కువగా 40 లోపు రంజీ మ్యాచులు ఆడిన అనుభవం ఉన్నవారికి రోజుకి రూ.50 వేలు చెల్లిస్తారు. 20 కంటే తక్కువ అనుభవం ఉన్న ప్లేయర్లకి రోజుకి రూ.40 వేలు దక్కుతుంది...

67

అలాగే అండర్ 23 ప్లేయర్లకు రూ.25 వేలు, అండర్ 19 క్రికెటర్లకి రూ.20 వేలు మ్యాచ్ ఫీజు రూపంలో చెల్లిస్తారు. అండర్ 16 నుంచి సీనియర్ లెవల్ వరకూ ఉన్న 2 వేల మంది మెన్స్ క్రికెటర్లకు ఈ పెంచిన మ్యాచ్ ఫీజులు ఎంతగానో ఉపకరించనున్నాయి.. 

77

అలాగే మహిళా క్రికెటర్ల పారితోషికాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఎప్పటిలాగే ఇక్కడ కూడా మహిళా క్రికెటర్లపైన వివక్ష చూపించిన భారత క్రికెట్ బోర్డు, ఇంతకుముందు చెల్లించే రూ.12,500 కు బదులుగా రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..

click me!

Recommended Stories