పొజిషన్ ఏదైనా సరే, బరిలో దిగడానికి నేనెప్పుడూ రెఢీ... సూర్యకుమార్ యాదవ్ కామెంట్...

First Published Mar 19, 2021, 3:10 PM IST

సూర్యకుమార్ యాదవ్‌కి టీమిండియాలో చోటు దక్కాలని అతను ఎంతగా కోరుకున్నాడో తెలీదు కానీ టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆరాటపడ్డారు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ రాకపోయినా, రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చే వన్‌డౌన్‌లో వచ్చి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు.. రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆరంగ్రేటం చేసినా, బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు...
undefined
తాజా ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్, ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశాడు...
undefined
‘టీమిండియా తరుపున ఆడాలనేది నా కల, నా జట్టు విజయంలో నావంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. గత నాలుగేళ్లలో నేను అన్ని బ్యాటింగ్ స్థానాల్లో ఆడాను..
undefined
ఓపెనింగ్ నుంచి ఎనిమిదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌ దాకా అన్ని ప్లేసుల్లో బ్యాటింగ్ చేశాను. కాబట్టి నాకు ఇదే పొజిషన్ కావాలి, ఇలాగే ఆడాలని ఏమీ అనుకోవడం లేదు...
undefined
పొజిషన్ ఏదైనా సరే ఆడడానికి నేను రెఢీ... టీమిండియా మేనేజ్‌మెంట్ అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాడు. వాళ్లు చెప్పిన స్థానంలో బ్యాటింగ్‌కి దిగడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను..
undefined
ఆర్చర్‌ను నేను ఐపీఎల్‌లో చూస్తూ వస్తున్నా. మూడు సీజన్లుగా అతన్ని బాగా గమనించాను. వికెట్ పడగానే కొత్త బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో పెట్టేందుకు అతను ప్రయత్నిస్తాడు...
undefined
అందుకే నాకు ఎలాంటి బంతి వేయబోతున్నాడో ముందుగానే గ్రహించా. ఇలాంటి సిక్సర్‌ కొట్టడం నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు.
undefined
57 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైన విషయం తెలిసిందే. అయితే రిప్లైలో బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది...
undefined
‘అలా అవుట్ అయినందుకు నేనేమీ బాధపడడం లేదు. క్రికెట్‌లో ఇలాంటివి సహజం. కొన్ని విషయాలు మన కంట్రోల్‌లో ఉండవు... ’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...
undefined
విజయ్ హాజారే ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్‌కి ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కూడా చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా వన్డే సిరీస్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేయబోతున్నారు.
undefined
click me!