Harbhajan Singh About Virat kohli: భారత టెస్టు సారథి విరాట్ కోహ్లి దాదాపు రెండేండ్లకు పైగా అభిమానులను నిరాశపర్చుతూనే ఉన్నాడు.కానీ ఈసారి మాత్రం కోహ్లి అలా చేయడని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లి సెంచరీ చేయక రెండేండ్లు దాటిపోయింది. సౌతాఫ్రికా సిరీస్ లో అయినా కోహ్లి ఆ కరువు తీర్చుకుంటాడని ఆయన అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా ఎదురుచూశారు.
28
కానీ సెంచూరియన్ లో జరిగిన మొదటి టెస్టులో టచ్ లోకి వచ్చినట్టే కనిపించినా అనవసరపు షాట్ లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక రెండో టెస్టులో గాయం కారణంగా అతడు ఆడలేదు. మూడో టెస్టులో కోహ్లి ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
38
ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రేపటినుంచి కేప్టౌన్ లో మొదలుకాబోయే టెస్టులో కోహ్లి సెంచరీ చేసి అభిమానుల కోరిక తీర్చుతాడని అన్నాడు.
48
తన యూట్యూబ్ ఛానెల్ లో హర్భజన్ మాట్లాడుతూ... ‘కేప్టౌన్ టెస్టులో విరాట్ ఆడతాడు. చాలా కాలంగా అతడి నుంచి సెంచరీ కోసం చూస్తున్న అతడి అభిమానుల కోరికను అతడు నెరవేర్చుతాడు.
58
కోహ్లితో పాటు పుజారా, రహానే లు కూడా భారీ స్కోర్లు సాధిస్తారని నేను భావిస్తున్నాను. వాండరర్స్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో రహానే, పుజారాలు మెరుగ్గా ఆడారు.
68
Virat Kohli
ఇక కేప్టౌన్ టెస్టులో మన బ్యాటర్లు 350-400 పరుగులు చేస్తే మనం దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించొచ్చు. కెఎల్ రాహుల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మయాంక్ కూడా మంచి ఆరంభాలే చేస్తున్నా వాటిని పెద్ద స్కోర్లుగా మలచాలి.
78
మూడో టెస్టులో భారత్ దే పైచేయి అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ టెస్టులో భారత్.. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే బెటర్. ఎందుకంటే కేప్టౌన్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది...’ అని భజ్జీ తెలిపాడు.
88
ఇదిలాఉండగా ఇప్పటివరకు కెరీర్ లో 70 సెంచరీలు చేసిన విరాట్.. 71 వ సెంచరీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. చివరగా 2019లో కోహ్లి.. బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత విరాట్ అభిమానులకు అది రెండేండ్లుగా తీరని కలగానే మిగిలిపోతున్నది. మరి ఈ టెస్టులో అయినా కోహ్లి శతకబాదుతాడో వేచి చూడాలి.