సెంచరీ ముంగిట బెయిర్‌ స్టో అవుట్... ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

Published : Mar 23, 2021, 08:27 PM IST

318 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్‌కు మెరుపు ఆరంభం లభించింది. టీ20, టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన బెయిర్ స్టో, మొదటి వన్డేలో విశ్వరూపం చూపించాడు.

PREV
18
సెంచరీ ముంగిట బెయిర్‌ స్టో అవుట్... ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

ఓ వైపు బెయిర్ స్టో, మరో ఎండ్‌లో జాసన్ రాయ్ బౌండరీల మోత మోగించడంతో 14.2 ఓవర్లలోనే 135 పరుగులకు చేరుకుంది ఇంగ్లాండ్ జట్టు... 35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన జాసన్ రాయ్‌ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు...

28

టీ20ల్లో రెండు సార్లు హాఫ్ సెంచరీ ముంగిట అవుటైన జాసన్ రాయ్, మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు...

38

11 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన బెన్ స్టోక్స్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లోనే, శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే మోర్గాన్ క్యాచ్ ఇచ్చినా, దాన్ని అందుకోని జారవిడిచాడు విరాట్ కోహ్లీ...

48

66 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో... శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

58

భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ సెంచరీ ముంగిట అవుట్ కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

68

30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

78

డేంజరస్ మ్యాన్ జోస్ బట్లర్ 2 పరుగులకే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 40 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...

88

అయితే బెయిర్ స్టో, జాసన్ రాయ్ ఇన్నింగ్స్ కారణంగా ఆరంభంలోనే భారీగా పరుగులు రావడంతో ఇంగ్లాండ్ సాధించాల్సిన రన్‌రేటు 6 కంటే పడిపోయింది. క్రీజులో ఉన్న మొయిన్ ఆలీ, సామ్ బిల్లింగ్స్‌తో పాటు సామ్ కుర్రాన్ కూడా బ్యాటింగ్ చేయగలడు.

click me!

Recommended Stories