అప్పుడు ఆంక్షలే లేవు... ఆసీస్ మీడియా ఇలా చేయడం సిగ్గుచేటు... బేబీ స్టోర్ యజమాని ఫైర్...

First Published Jan 6, 2021, 1:20 PM IST

ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు కరోనా నిబంధనలను పాటించడం లేదంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. న్యూఇయర్ పార్టీ పేరుతో రోహిత్ శర్మ అండ్ కో పార్టీ చేసుకున్న ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో ఆసీస్ మీడియా మొదలెట్టిన రచ్చ, అప్పుడెప్పుడో నెల రోజుల కిందట విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా బేబీ స్టోర్‌కి వెళ్లి ప్రోటోకాల్‌ను అతిక్రమించారని కథనాలు ప్రచారం చేసేదాకా వెళ్లింది.

బాక్సింగ్ డే టెస్టుకి ముందు వరకూ టీమిండియాపై ఎలాంటి ద్వేషం ప్రకటించని ఆసీస్ మీడియా, భారత జట్టు ఊహించని విజయంతో ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసింది.
undefined
భారత జట్టు ప్రవర్తనను ఎత్తి చూపిస్తూ, టీమిండియాకి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తూ... జట్టును ఒత్తిడిలోకి నెట్టేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది...
undefined
న్యూఇయర్ రోజున రోహిత్ శర్మ, నవ్‌దీప్ సైనీ, రిషబ్ పంత్, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్ కలిసి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడాన్ని తీవ్రంగా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా, కరోనా ప్రోటోకాల్‌ను అతిక్రమించారా? తేల్చేందుకు దర్యాప్తుకి కూడా ఆదేశించారు.
undefined
అయితే అప్పుడెప్పుడో వన్డే సిరీస్ అనంతరం ఓ బేబీ స్టోర్‌లో షాపింగ్ చేసిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా... బయో బబుల్ ప్రోటోకాల్ అతిక్రమించారని వార్తలు వచ్చాయి.
undefined
మాస్కులు లేకుండా షాపింగ్ చేయడమే కాకుండా స్టోర్ వర్కర్లతో కలిసి ఫోటోలు కూడా దిగారంటూ కెప్టెన్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాల ప్రవర్తన సరికాదంటూ ఆసీస్ మీడియా ప్రచారం చేసింది.
undefined
ఈ వార్తలపై ఫైర్ అయ్యింది సదరు బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా స్టోర్‌కి వచ్చినప్పుడు నగరంలో ఎలాంటి ఆంక్షలు లేవని, ఇప్పుడు మీడియా ఇలా చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
undefined
డిసెంబర్ 7న విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కలిసి సిడ్నీలోని ఓ బేబీ స్టోర్ షాప్‌కి వెళ్లారు. పాండ్యా తన కొడుకు అగస్త్య కోసం, కోహ్లీ తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇక్కడ షాపింగ్ చేశారు.
undefined
తన స్టోర్‌కి భారత కెప్టెన్, క్రికెట్ సూపర్ స్టార్ రావడంతో ఆశ్చర్యపోయిన బేబీ స్టోర్ యజమానులు, వర్కర్లు వారితో ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలే ఇప్పుడు వివాదం రేగడానికి కారణమయ్యాయి.
undefined
‘విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మా స్టోర్‌కి వచ్చారు. అయితే ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి కరోనా ఆంక్షలు లేవు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు మేం కొన్ని గిఫ్టులు ఇవ్వాలనుకున్నాం.
undefined
అయితే వాళ్లు ఎంతో ప్రేమగా అన్నింటికీ డబ్బులు చెల్లించారు. ఎంతో ఓపిగ్గా మాతో సమయం గడిపారు. ఉద్యోగులు కోరడంతో ఓపిగ్గా ఫోటోలు కూడా దిగారు...
undefined
కరోనా ప్రోటోకాల్ అమలులో లేకపోయినా తాకేందుకు వారు అనుమతించలేదు... ఎందుకంటే వారికి ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంది...
undefined
విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మా స్టోర్‌కి వచ్చారని గర్వంగా చెప్పుకునేందుకు, ఫ్యామిలీతో పంచుకునేందుకే వారితో ఫోటోలు దిగాం... వాటిని సోషల్ మీడియాలో పెట్టాం...
undefined
ఆ ఫోటోలను చూపించి, ఆస్ట్రేలియా ఇలా వారిని కించపరిచే విధంగా కథనాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు...’ అంటూ తీవ్రంగా ఖండించింది బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్...
undefined
ఇన్నాళ్లు భారతీయ మీడియానే అతి చేస్తూ, అనవసర రాద్ధాంతం చేస్తుందని అనుకున్న టీమిండియా అభిమానులకు, ఆస్ట్రేలియా మీడియా చేస్తున్న రాద్ధాంతం చూశాక మనవాళ్లే కాస్త బెటర్ అనుకుంటున్నారట.
undefined
click me!