ఆ నలుగురే ఇష్టం! బాబర్ ఆజమ్ ఫెవరెట్ ప్లేయర్ల లిస్టులో కోహ్లీ, ధోనీ, రోహిత్‌లకు దక్కని చోటు...

First Published May 8, 2023, 4:09 PM IST

పసికూనలపై ప్రతాపం చూపిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్నా, బాబర్ ఆజమ్ చేస్తున్న పరుగులు, క్రియేట్ చేస్తున్న రికార్డులు చూస్తే మెంటల్ ఎక్కుద్ది. స్టార్ ప్లేయర్లు లేని న్యూజిలాండ్ సీ టీమ్‌పై తన ప్రతాపం చూపించిన బాబర్ ఆజమ్, 2 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో చెలరేగాడు..
 

rohit babar

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 49 పరుగులు చేసి అవుటైన బాబర్ ఆజమ్, ఆ తర్వాత వరుసగా 65, 54, 107 పరుగులు చేశాడు. ఆఖరి వన్డేలో సింగిల్ డిజిట్ స్కోరుకి అవుట్ కావడంతో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది..

Babar Azam

వన్డేల్లో 100 మ్యాచులు తర్వాత  5089 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఈ ఫీట్ సాధించిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. హషీమ్ ఆమ్లా మొదటి 100 మ్యాచుల తర్వాత 4808 పరుగులు చేస్తే శిఖర్ ధావన్ 4309, డేవిడ్ వార్నర్ 4217 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీవ్ రిచర్డ్స్ 4146, విరాట్ కోహ్లీ 4107 పరుగులతో టాప్ 8,9 స్థానాల్లో ఉన్నారు..

Latest Videos


Babar Azam

తాజాగా ప్రస్తుత తరంలో తన ఫెవరెట్‌ క్రికెటర్ల గురించి కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్. ఈ లిస్టులో భారత లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ లేకపోవడం విశేషం...

Babar Azam

‘నేటి తరంలో నాకు కేన్ విలియంసన్, జో రూట్, జోస్ బట్లర్, అబ్దుల్లా షఫిక్ బ్యాటింగ్ చాలా నచ్చుతుంది. మోడ్రన్ డే క్రికెట్‌లో వీళ్లు నా ఫ్యాబ్ 4’ అంటూ కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్...

నేటి తరంలో ఫ్యాబ్ 4గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్‌లను కేన్, రూట్ పేర్లను ప్రకటించిన బాబర్ ఆజమ్, కోహ్లీ, స్మిత్‌లను విస్మరించడం విశేషం..
 

Image credit: Getty

జోస్ బట్లర్: ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా ఉన్న జోస్ బట్లర్, ఇప్పటిదాకా 57 టెస్టులు, 162 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన జో రూట్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 95 పరుగులు చేసి సెంచరీ మిస్ అయ్యాడు.
 

Image credit: PTI

కేన్ విలియంసన్: అంతర్జాతీయ క్రికెట్‌లో 94 టెస్టులు, 161 వన్డేలు, 87 టీ20 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా కేన్ విలియంసన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా దూరం కాబోతున్నాడు..
 

జో రూట్: ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో  రూట్, ప్రస్తుత తరంలో 10 వేల టెస్టు పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 158 వన్డేలు, 32 టీ20 మ్యాచులు ఆడిన జో రూట్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు. అయితే మొదటి మ్యాచ్‌లో జో రూట్‌కి బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు.

అబ్దుల్లా షఫిక్:23 ఏళ్ల పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్, ఇప్పటిదాకా 12 టెస్టులు, 6 టీ20 మ్యాచులు మాత్రమే ఆడాడు. 12 టెస్టుల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేసిన అబ్దుల్లా షఫిక్‌ని ఫేవరెట్ క్రికెటర్‌గా చెప్పిన బాబర్ ఆజమ్... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ వంటి దిగ్గజాలను పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్.. 

click me!