ఈ సిరీస్ ఓటమితో బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లపై గౌరవం పెరుగుతుంది,... షాదబ్ ఖాన్ కామెంట్..

Published : Mar 27, 2023, 03:27 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన పాకిస్తాన్ జట్టు... పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో రెండు టీ20ల్లో వరుసగా ఓడింది. తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

PREV
16
 ఈ సిరీస్ ఓటమితో బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లపై గౌరవం పెరుగుతుంది,... షాదబ్ ఖాన్ కామెంట్..
Babar and Rizwan

పీఎస్‌ఎల్ తర్వాత పాకిస్తాన్ రెగ్యూలర్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు... దాదాపు బీ టీమ్‌ని ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్ కోసం పంపింది... అయితే తొలి రెండు మ్యాచుల్లో పాక్‌కి ఊహించని షాక్ తగిలింది..

26

ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షాదబ్ ఖాన్, రెండో టీ20లో ఓటమి తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.. ‘బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌ బాగా ఆడినా, ఆడకపోయినా జనాలు వారిని ట్రోల్ చేస్తూనే ఉంటారు. వారి స్ట్రైయిక్ రేటు గురించి ఎన్నో రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది... 

36
Mohammad Rizwan

కుర్రాళ్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలని మేం కూడా అనుకుంటాం. అయితే పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో ఆడినట్టుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడం జరగని పని. పీఎస్‌ఎల్‌లో సిక్సర్లు బాదిన వారంతా మంచి స్ట్రైయిక్ రేటుతో పాక్‌ తరుపున ఆడతారని అనుకున్నాం.. కానీ ఏం జరిగింది...

46

ఈ ఓటమి వల్ల బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లకు దేశంలో గౌరవం పెరుగుతుంది. దేశానికి ఆడేటప్పుడు ఎలా ఆడిలా వాళ్లు నిరూపించారు. కుర్రాళ్లు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చారు. వాళ్లకి ఈ వాతావరణం అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది...

56

కుర్రాళ్లను ప్రోత్సహించడం మా అందరి బాధ్యత. టాలెంట్ విషయంలో వాళ్లు ఎవ్వరికీ తక్కువేమీ కాదు. రేపు పరువు కాపాడుకోవడం కోసం ఆఖరి మ్యాచ్ ఆడతాం.. చివరి మ్యాచ్‌లో అయినా గెలవాలని అనుకుంటున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ క్రికెటర్, తాత్కాలిక కెప్టెన్ షాదబ్ ఖాన్...

66

పీఎస్‌ఎల్ 2023 సీజన్‌లో రికార్డు స్థాయిలో సెంచరీలు నమోదయ్యాయి. బౌండరీ లైన్ 55 మీటర్ల కంటే దగ్గరగా ఉండడంతో పాటు పిచ్ బ్యాటర్లకు స్వర్గ ధామంగా మారడంతో సిక్సర్ల మోత మోగింది. పీఎస్‌ఎల్ పర్ఫామెన్స్‌తో టీమ్‌లోకి వచ్చిన కుర్రాళ్లు, ఆఫ్ఘాన్‌తో సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు.. 

click me!

Recommended Stories