కీలక టోర్నీలు ముందున్నాయి.. మా బౌలర్లు జాగ్రత్త.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశం..!

Published : Mar 27, 2023, 02:08 PM IST

IPL 2023: త్వరలో మొదలయ్యే ఐపీఎల్  లో పాల్గొనబోతున్న భారత  క్రికెటర్ల గురించి బీసీసీఐ  జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇప్పటికే  పలు క్రికెటర్లు గాయాలబారిన పడ్డ వేళ  ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. 

PREV
16
కీలక టోర్నీలు ముందున్నాయి.. మా బౌలర్లు జాగ్రత్త.. ఫ్రాంచైజీలకు  బీసీసీఐ  ఆదేశం..!

మరో నాలుగు రోజుల్లో మొదలుకాబోయే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లోని పది ఫ్రాంచైజీలకు  భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.  టీమిండియా బౌలర్లను ఎక్కువ కష్టపెట్టొద్దని, కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో  ఫ్రాంచైజీలు అర్థం చేసుకోవాలని సూచించింది.  

26

ఈ ఏడాది  జూన్ లో  టీమిండియా వరల్డ్  టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. పదేండ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ  సాధించడంలో విఫలమవుతున్న భారత జట్టు.. ఈ ఏడాదైనా ఆ  లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నది.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ కూడా ఉంది.

36

ఇప్పటికే గాయాల కారణంగా  రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా,  ప్రసిధ్ కృష్ణ లతో పాటు  శ్రేయాస్ అయ్యర్ కూడా   గాయాల బాధితుల జాబితాలో చేరాడు. వీరందరూ  డబ్ల్యూటీసీ ఫైనల్ కు మిస్ అవనున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న క్రికెటర్లనైనా  కాపాడుకోవాలని  బీసీసీఐ భావిస్తున్నది. ఇందులో భాగంగానే  భారత క్రికెటర్లు.. మరీ ముఖ్యంగా  బౌలర్ల విషయంలో  చాలా జాగ్రత్తలను తీసుకుంటున్నది.  

46

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు  ఇన్‌సైడ్‌స్పోర్ట్స్ తో మాట్లాడుతూ... ‘బౌలర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇదివరకే ఫ్రాంచైజీలతో నిర్వహించిన జూమ్ కాల్ లో చెప్పాం. నెట్స్ లో బౌలర్లతో మరీ ఎక్కువ ప్రాక్టీస్ చేయించకుండా  చూసుకోమని వారికి సూచించాం.   బౌలింగ్ కంటే కూడా  బౌలర్లు వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందించేకునే విధంగా కృషి చేయాలని చెప్పాం. మే మొదటివారం వరకు ఫిల్డింగ్ డ్రిల్స్ చేసి  ఆ తర్వాత వారిని ఒత్తిడి పెట్టకుంటే మంచిదని సూచించాం..’అని తెలిపాడు. 

56

బుమ్రా వెన్ను గాయంతో సర్జరీ చేయించుకోగా భారత జట్టుకు   మహ్మద్ షమీ, సిరాజ్, శార్దూల్ లు కీలకంగా మారారు. ప్రసిధ్ కృష్ణ కూడా అందుబాటులో లేకపోవడం.. దీపక్ చహర్ ఇంకా ఫిట్నెస్ సాధించలేకపోవడంతో ఉమ్రాన్  మాలిక్, ఉమేశ్ యాదవ్ లు కూడా  కీలకంగా మారారు. వీళ్లే గాక  స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా, చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్  కూడా  రాబోయే రెండు కీలక టోర్నీలకు  కీలకంగా ఉన్నారు. 

66

బౌలర్ల విషయంలో ఎన్సీఏ  ప్రత్యేక దృష్టి సారించనుందని  సమాచారం. ఫ్రాంచైజీలతో సమన్వయం చేసుకుంటూ  ఆటగాళ్ల  ఫిట్నెస్ పై ఎన్సీఏ  ఫిట్నెస్ కోచ్ లు, వైద్యులు ఓ కన్నేసి ఉంచనున్నారు. మరి  ఫ్రాంచైజీలు ఈ ఆదేశాలను పాటిస్తాయా..?  

click me!

Recommended Stories