టీ20ల్లో దాన్ని పట్టించుకోవడం వేస్ట్! అందుకే వాళ్లిద్దరూ సక్సెస్ అయ్యారు... - వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

Published : Oct 11, 2022, 03:11 PM IST

టెస్టులను వన్డేల్లాగ, వన్డేలను టీ20ల్లా ఆడడం వీరేంద్ర సెహ్వాగ్ స్పెషాలిటీ. టీ20 ఫార్మాట్ రావడం ఆలస్యమైనా వీరూ బ్యాటింగ్ చూసిన వాళ్లకి ఈ మెరుపులు, వీరబాదుడు ఇన్నింగ్స్‌లు కొత్తేమీ కాదు. ఎంతో టాలెంట్ ఉన్నా కెరీర్ చివర్లో నిలకడైన ప్రదర్శన ఇవ్వలేక, జట్టులో చోటు కోల్పోయాడు వీరేంద్ర సెహ్వాగ్...

PREV
15
టీ20ల్లో దాన్ని పట్టించుకోవడం వేస్ట్! అందుకే వాళ్లిద్దరూ సక్సెస్ అయ్యారు... - వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
Sehwag-Ganguly

క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కామెంటేటర్‌గా మారిన వీరేంద్ర సెహ్వాగ్, ప్రతీ చిన్న విషయంపై తన స్టైల్‌లో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి వీరూ... రోహిత్ శర్మ ఫామ్‌ గురించి స్పందించాడు...

25
Virender Sehwag

‘టీ20ల్లో సగటు చాలా ఓవర్‌రేటెడ్. అంటే నా ఉద్దేశంలో పొట్టి ఫార్మాట్‌లో యావరేజ్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత తరానికి ఎన్ని పరుగులు చేశామనేది కాదు, ఎంత త్వరగా చేశామనేది ముఖ్యం...

35

నా ఉద్దేశంలో ఇప్పుడు ప్రతీ క్రికెటర్‌కి ఇంటెట్ చాలా ముఖ్యం. రోహిత్ శర్మ ప్రతీ మ్యాచ్‌లో 100 స్ట్రైయిక్ రేటుతో 30+ పరుగులు చేయడం వల్ల జట్టుకి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. రోహిత్ శర్మ ఆడితే స్ట్రైయిక్ రేటు 200+లో ఉండాలి...

45
Image credit: PTI

అలా రోహిత్ శర్మ చేసే పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. ప్రస్తుతం రోహిత్, సూర్యలాంటి ప్లేయర్లే టీ20 ఫార్మాట్‌కి కావాలి...

55

సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వాళ్ల రేంజ్‌కి తగ్గట్టు ఆడితే, టీమిండియాకి ఎవ్వరూ ఆపలేరు. నా వరకూ టీ20 వరల్డ్ కప్‌లో ఈ ఇద్దరే కీలకంగా మారతారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... 

click me!

Recommended Stories