David Warner: వార్నర్ కు భారీ ఊరట.. నిషేధం ఎత్తివేయనున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. అదే జరిగితే..!

Published : Jun 24, 2022, 10:25 AM IST

Cricket Australia: సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నది. కొద్దికాలంగా అతడి మీదున్న నిషేధాన్ని ఎత్తివేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భావిస్తున్నది. 

PREV
16
David Warner: వార్నర్ కు భారీ ఊరట.. నిషేధం ఎత్తివేయనున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. అదే జరిగితే..!

ఆస్ట్రేలియా ఓపెనర్, ఐపీఎల్ లో గత సీజన్ వరకు సన్ రైజర్స్ కు ఆడి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న డేవిడ్ వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్. వార్నర్ కెప్టెన్సీ చేయకుండా  గతంలో నిషేధం విధించిన సీఏ త్వరలో ఆ నిర్ణయాన్ని ఎత్తివేయనున్నది. 

26

వార్నర్ భాయ్ మీదున్న నిషేధాన్ని ఎత్తివేసే దిశగా సీఏ చర్చలు జరుపుతున్నది. ఈ మేరకు సీఏలోని అధికారులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఇందుకు సీఏ అంగీకరిస్తే మాత్రం.. బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ సారథ్యం వహించే అవకాశాన్ని పొందుతాడు. 

36

2018 లో దక్షిణాఫ్రికా తో కేప్ టౌన్ వేదికగా జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ కు పాల్పడినందుకు గాను డేవిడ్ వార్నర్ తో పాటు నాటి ఆసీస్ సారథి  స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్క్రాఫ్ట్ ల మీద సీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

46

ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లను విచారించి వాళ్లు నేరం అంగీకరించిన నేపథ్యంలో... దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులలో ఆడకుండా  బాన్క్రాఫ్ట్ మీద 9 నెలల పాటు నిషేధం విధించింది. 
 

56

ఇక ఈ వివాదంలో కీలక సూత్రదారులైన స్మిత్, వార్నర్ మీద ఏడాది పాటు నిషేధం వేసింది. ఈ క్రమంలో వార్నర్ కు ఆస్ట్రేలియా దేశవాళీ, జాతీయ జట్టులలో సారథ్యం వహించకుండా లైఫ్ టైమ్ బ్యాన్  వేసింది.  దీంతో భావి ఆసీస్ కెప్టెన్ అని భావించిన అతడికి భారీ షాక్ తగిలింది. సీఏ నిర్ణయంతో అతడు బిగ్ బాష్ లీగ్ లో కూడా కెప్టెన్ గా కాకుండా సాధారణ ఆటగాడిగానే  ఆడాల్సి వచ్చింది. 

66

ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని సీఏ చర్చలు జరుపుతున్నది. గత కొంతకాలంగా తన పని తాను చేసుకుంటున్న వార్నర్ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం ఆట మీద దృష్టి పెట్టిన వార్నర్.. ఇటీవల కాలంలో అత్యంత సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా మారాడు. ఒకవేళ నిషేధాన్ని వార్నర్ మళ్లీ బిగ్ బాష్ లీగ్ లో కెప్టెన్ గా ఉండే అవకాశం దక్కుతుంది.

click me!

Recommended Stories