భారీ ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... సైనీకి రెండు వికెట్లు...

Published : Jan 10, 2021, 07:15 AM IST

మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పుల కారణంగా లభించిన ఆధిక్యాన్ని, రెండో ఇన్నింగ్స్‌లో అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 94 పరుగుల ఆధిక్యంతో కలిపి 276 పరుగుల భారీ లీడ్ సాధించింది ఆస్ట్రేలియా.

PREV
111
భారీ ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... సైనీకి రెండు వికెట్లు...

నాలుగో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు హనుమ విహారి.... ఈ లైఫ్ తర్వాత ఆచితూచి బ్యాటింగ్ చేశారు లబుషేన్, స్మిత్...

211

మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన లబుషేన్, స్టీత్ స్మిత్... రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ఫీట్ రిపీట్ చేశారు. మూడో వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

311

ఈ దశలో 118 బంతుల్లో 9 ఫోర్లతో 73 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్... నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

411

ఆ తర్వాత కొద్దిసేపటికే 4 పరుగులు చేసి మాథ్యూ వైడ్ కూడా సైనీ బౌలింగ్‌లో సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

511

148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

611

అయితే ఆ తర్వాత భారత బౌలర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్... 

711

మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించడం స్మిత్‌కిది 11వ సారి...

811

టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో అత్యధికసార్లు 50+ స్కోర్లు చేసిన క్రికెటర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. రికీ పాంటింగ్ 15 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్నాడు...

911

ఆస్ట్రేలియా తరుపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన తొమ్మదో ప్లేయర్‌గా నిలిచాడు స్టీవ్ స్మిత్... 7422 పరుగులు చేసి డీసీ బ్రూన్‌ను అధిగమించాడు స్మిత్...

1011

లంచ్ విరామ సమయానికి కామెరూన్ గ్రీన్ 58 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు, స్టీవ్ స్మిత్ 155 బంతుల్లో 5 ఫోర్లతో 58 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...

1111

ఈ ఇద్దరూ 90 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. లంచ్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియాను ఎంత తక్కువ స్కోరుకి పరిమితం చేయగలిగితే టీమిండియాకు అంత మంచిది. 

click me!

Recommended Stories