బ్రెట్‌ లీ కొడుక్కి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... ఆసీస్ లెజెండరీ బౌలర్ అలా చెప్పగానే...

Published : Jul 14, 2022, 12:20 PM IST

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని ఆడించే కంటే కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కొందరు అభిప్రాయపడుతుంటే... మరికొందరు ‘ఫామ్ ఈజ్ టెంపరరీ... విరాట్ క్లాస్ ఈజ్ పర్మినెంట్’ అంటున్నారు... తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు...

PREV
17
బ్రెట్‌ లీ కొడుక్కి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... ఆసీస్ లెజెండరీ బౌలర్ అలా చెప్పగానే...

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి భారతదేశమంటే ప్రత్యేకమైన అభిమానం. 25 ఏళ్లుగా తరుచుగా ఇండియాకి వస్తున్న బ్రెట్ లీ, ఇక్కడ అనేక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాడు...

27

‘విరాట్ కోహ్లీతో ఓ స్పెషల్ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తిండిపోయింది. భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఆ మ్యాచ్‌కి నేను కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నా... నేను, కామెంటరీ చెబుతున్న సమయంలో విరాట్ అక్కడికి వచ్చాడు...

37

ఆ సమయంలో విరాట్ కోహ్లీతో చాలాసేపు మాట్లాడాను. మేం ఇద్దరం కలిసి ఆడిన సమయంలో మూమెంట్స్‌ని గుర్తు చేసుకున్నాం. అప్పుడు నేను మా బాబు గురించి, కోహ్లీకి చెప్పాను...

47

‘మా బాబు ప్రిస్టన్‌కి నువ్వు చాలా ఫెవరెట్ ప్లేయర్‌వి. నీ బ్యాటింగ్ అస్సలు మిస్ కాడు... ’ అన్నాను. దానికి విరాట్... ‘రియల్లీ...’ అంటూ సర్‌ప్రైజ్ అయ్యాడు. నేను... ‘అవును... నీ కవర్ డ్రైవ్ అంటే అతనికి పిచ్చి...’ అంటూ చెప్పాను.. అతను నవ్వుతూ వెళ్లిపోయాడు..

57

ఆ టెస్టు మ్యాచ్ అయిన తర్వాత విరాట్ నా దగ్గరికి వచ్చి తన టెస్టు జెర్సీ ఇచ్చాడు. దానిపైన కెప్టెన్ విరాట్ కోహ్లీ... అడ్రెస్ టు ప్రిస్టన్’ అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు... ఇప్పుడు ఆ జెర్సీ, తన రూమ్‌లో అలాగే ఉంది...’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు బ్రెట్ లీ...

67

ఆస్ట్రేలియా తరుపున 76 టెస్టులు, 221 వన్డేలు ఆడిన బ్రెట్ లీ, తన కెీరర్‌లో 690 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ తీసిన బ్రెట్ లీ, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు... 

77

గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేకి దూరమైన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలోనూ ఆడడం అనుమానంగానే మారింది. విరాట్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పుడూ కూడా గాయం కారణంగా వరుసగా రెండు మ్యాచులకు దూరమయ్యింది లేదు... 

Read more Photos on
click me!

Recommended Stories