బ్యాటింగ్, బౌలింగ్ ఓకే! ఫీల్డింగ్ సంగతేంటి... వరల్డ్ కప్ ముందు ఈజీ క్యాచులు డ్రాప్ చేస్తున్న టీమిండియా...

First Published | Sep 15, 2023, 5:43 PM IST

కొన్నాళ్లుగా ద్వైపాక్షిక సిరీసుల్లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చిన భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఆసియా కప్ 2023 టోర్నీలో గ్రూప్‌ స్టేజీలో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు విజయాలు అందుకుంది...
 

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత జట్టు, శ్రీలంకతో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో 41 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది...
 

రోహిత్ శర్మ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అజేయ సెంచరీలతో చెలరేగారు. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్ నుంచి కూడా మంచి పర్ఫామెన్స్ వచ్చింది..

Latest Videos


భారత బౌలర్లు కూడా ఆసియా కప్ 2023 టోర్నీలో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు..
 

Kuldeep Yadav

అయితే ఫీల్డింగ్‌లో మాత్రం భారత జట్టు పర్ఫామెన్స్ అస్సలు బాగోలేదు. నేపాల్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో మొదటి 4 ఓవర్లలో మూడు క్యాచులు డ్రాప్ చేశారు భారత ఫీల్డర్లు. విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ వంటి ఫీల్డర్లు కూడా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేస్తున్నారు..

పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో ఈ క్యాచ్ డ్రాప్‌లు కాస్త తక్కువగా కనిపించినా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రోహిత్ శర్మ ఈజీ క్యాచ్‌లను డ్రాప్ చేశారు..

Sanju Catch

ఇది నామమాత్రపు మ్యాచ్ కాబట్టి పర్లేదు కానీ, వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఒక్క క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేయొచ్చు. వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఫీల్డింగ్‌పైన కూడా టీమిండియా ఫోకస్ పెంచాల్సి ఉంటుంది..

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్‌తో ఆడేటప్పుడు అవకాశాలు అంత ఈజీగా రావు. వచ్చిన అవకాశాలను అందుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

Kohli-Rohit hug

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకట్టుకున్న రోహిత్ అండ్ టీమ్, ఫీల్డింగ్‌పైన స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

click me!