ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌లో జరిగిన అన్ని మ్యాచులు సజావుగా ముగిశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో మాత్రం సాంకేతిక కారణాలతో ఆట పావుగంట సేపు ఆగిపోయింది..
లాహోర్‌లోని ఓ ఫ్లడ్ లైట్ పనిచేయకపోవడం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు, లాహోర్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు బకాయిలు కట్టకపోవడం వల్లే కరెంటు నిలిపివేసినట్టు సమాచారం. అయితే పావుగంటలో పావు వంతు బకాయిలు చెల్లించడంతో మళ్లీ పవర్ సప్లై చేసినట్టు వార్తలు వచ్చాయి..
పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పాక్ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. అయినా పాక్ సూపర్ లీగ్‌లో పిచ్‌ని ఆరబెట్టేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌లను వాడింది పీసీబీ.. ఆ ఫోటోలను చూసి లక్ష కోట్ల బ్రాండ్ వాల్యూ ఉన్న ఐపీఎల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు..
Wet Pitch
అయితే బీసీసీఐ కేవలం ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారానే రూ.43 వేల కోట్లు ఖాతాలో వేసుకుంది. అలాంటి బీసీసీఐ, గ్రౌండ్‌లో అవుట్ ఫీల్డ్ ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్లు, ఇస్త్రీ పెట్టెలు వాడింది..
ఆర్థిక మాంద్యంతో ఆసియా కప్ 2022 టోర్నీని యూఏఈకి తరలించిన శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం అవుట్ ఫీల్డ్ ఆరబెట్టేందుకు బీసీసీఐ కంటే అధునాతన పద్ధతులను వాడింది... బీసీసీఐ గ్రౌండ్‌లో నిలిచిన నీటిని తీసేందుకు స్పంజీలను వాడుతోంది..
కానీ లంక క్రికెట్ బోర్డు, బీసీసీఐ కంటే బెటర్ షీట్లను వాడింది. అలాగే తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్‌ని ఆరబెట్టేందుకు గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్‌ను తీసుకొచ్చింది. దీని కంటే త్వరగానే పిచ్ సిద్ధమైంది కూడా...
వచ్చే నెలలో ఇండయాలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం దేశంలోని స్టేడియాలన్నింటిలో మరమ్మత్తులు చేస్తోంది బీసీసీఐ. వరల్డ్ కప్‌లో హెయిర్ డ్రైయర్స్, ఇస్త్రీ పెట్టెలు కనిపిస్తే మాత్రం, బీసీసీఐ పరువుతో పాటు దేశం పరువు పోవడం ఖాయం..