ధోనీ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్... 19 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన హార్ధిక్- ఇషాన్ జోడి..

First Published Sep 2, 2023, 8:29 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ దగ్గర పడే కొద్దీ టీమిండియాకి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్, అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకి ఆపద్భాంధవుడిగా మారాడు.. 
 

రోహిత్, విరాట్, శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ స్వల్ప స్కోర్లకే అవుట్ కావడంతో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాని ఆదుకున్నారు. 
 

Ishan Kishan-Hardik Pandya-Afridi

82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2008 ఆసియా కప్‌లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌కి అత్యధిక స్కోరు.. 

Latest Videos


ఓవరాల్‌గా ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌గా మూడో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు ఇషాన్ కిషన్. 2008లో హంగ్‌కాంగ్‌పై ధోనీ 109 పరుగులు చేయగా, 2004లో యూఏఈపై రాహుల్ ద్రావిడ్ 104 పరుగులు చేసి ఇషాన్ కిషన్ కంటే ముందున్నారు..

వన్డే ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో అత్యధిక స్కోరు బాదిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు ధోనీ 109, సురేష్ రైనా 101 పరుగులు చేసి ఇషాన్ కిషన్ కంటే ముందున్నారు. 

Ishan Kishan-Hardik Pandya

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్, వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ బాదాడు. 2011లో ధోనీ ఈ ఫీట్ సాధించగా, 2023లో ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు.. 

ఐదు, ఆరో స్థానాల్లో భారత బ్యాటర్లు 50+ స్కోరు చేయడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2007లో రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, 2008లో రోహిత్ - ధోనీ ఈ ఫీట్ సాధించారు. 

హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి నెలకొల్పిన  138 పరుగుల భాగస్వామ్యం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఐదో వికెట్‌కి టీమిండియా తరుపున ఇదే  అత్యుత్తమ భాగస్వామ్యం.  ఇంతకుముందు 2004లో రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ కలిసి జోడించిన 133 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు హార్ధిక్ - ఇషాన్ కిషన్..


వన్డే మ్యాచ్‌లో ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటర్లు 80+ స్కోర్లు చేయడం టీమిండియాకి ఇది నాలుగోసారి. ఇంతకుముందు 1997లో శ్రీలంకపై అజారుద్దీన్, అజయ్ జడేజా ఈ ఫీట్ సాధించగా 2005లో వెస్టిండీస్‌పై యువరాజ్ సింగ్- మహ్మద్ కైఫ్, 2015లో జింబాబ్వేపై రైనా- ధోనీ హాఫ్ సెంచరీలు చేశారు.. 

click me!