విరాట్ కోహ్లీ కూడా అన్ని సార్లు మ్యాచ్ గెలిపించలేడు! ఆ రోజు ఏం జరుగుతుందో... పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్ కామెంట్

Published : Aug 27, 2023, 05:08 PM IST

విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై తిరుగులేని రికార్డు ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో ఒంటరి పోరాటంతో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2022 టీ20 వరల్డ్ కప్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియాకి అద్భుత విజయం అందించాడు..

PREV
16
విరాట్ కోహ్లీ కూడా అన్ని సార్లు మ్యాచ్ గెలిపించలేడు! ఆ రోజు ఏం జరుగుతుందో... పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్ కామెంట్

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్, వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్‌...

26
India vs Pakistan

ప్రస్తుతం క్రికెట్ వరల్డ్‌లో టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్న జట్టు పాకిస్తాన్. ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టుని ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌‌కి ఈ ప్రశ్నే ఎదురైంది..

36

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్‌ల కోసం ఏ ప్లాన్ చేశారని ఓ మీడియా ప్రతినిథి అడగగా, దానికి అజిత్ అగార్కర్, ‘వాళ్లను విరాట్ కోహ్లీ చూసుకుంటాడు..’ అంటూ సమాధానం ఇచ్చాడు..

46
India vs Pakistan

తాజాగా పాక్ ఆల్‌రౌండర్ షాదబ్ ఖాన్, ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. ‘చూడండి, ఒక్క మ్యాచ్ గెలిపించినంత మాత్రాన విరాట్ కోహ్లీ, ప్రతీ మ్యాచ్‌లోనూ దాన్నే రిపీట్ చేయలేదు.. ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం.

56

నేను కానీ లేదా మరెవ్వరైనా కానీ మాటలు చెప్పడం చాలా సులువు. అయితే మాటలతో ఏదీ అయిపోదు. మ్యాచ్ రోజున ఎవరు బాగా ఆడితే వాళ్లే గెలుస్తారు.. మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు షాదబ్ ఖాన్..

66
Shadab Khan

ఆఫ్ఘాన్‌తో జరిగిన రెండో వన్డేలో 35 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, పాకిస్తాన్‌కి ఉత్కంఠ విజయం అందించాడు. ఈ వన్డే సిరీస్‌లో బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు షాదబ్ ఖాన్.. 

Read more Photos on
click me!

Recommended Stories