ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కి ముందు టీమ్‌లో చోటు కూడా దక్కించుకోలేకపోయిన అజింకా రహానే, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపకయ్యాడు...
దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్ 2023 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వడంతో 17 నెలల తర్వాత టీమిండియాలో అవకాశం దక్కించుకున్న అజింకా రహానే, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్‌తో తిరిగి టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు..
28
అయితే వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో రెండుసార్లు బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, రెండు సార్లు కూడా డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయాడు. తొలి టెస్టులో 3 పరుగులు చేసి అవుటైన రహానే, రెండో టెస్టులో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు..
38
Rahane Cacth
‘ఈ టెస్టు సిరీస్‌లో అజింకా రహానే, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. శుబ్‌మన్ గిల్ ఫెయిల్యూర్ అతని ఫ్యూచర్‌పై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే అతనికి మరో రెండేళ్ల వరకూ అవకాశాలు వస్తాయి.. కానీ అసలు సమస్య రహానేకే..
48
Ajinkya Rahane
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అజింకా రహానే బాగా ఆడాడు. ఆ తర్వాత కారణంగానే అతనికి వైస్ కెప్టెన్సీ దక్కింది. రహానేకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కూడా చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సిరీస్‌ని అతను సరిగ్గా వాడుకోలేకపోయాడు..
58
Ajinkya Rahane
రెండు సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా తన మార్కు చూపించలేకపోయాడు. ఇది అతని అవకాశాలు దెబ్బ తీయొచ్చు. ఎందుకుంటే కొన్నేళ్లుగా రహానే నిలకడైన ప్రదర్శన ఇవ్వడం లేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో కూడా అదే రిపీట్ అయ్యింది..
68
Rahane and Kohli
సౌతాఫ్రికాలో జరిగే టెస్టు సిరీస్‌లో అజింకా రహానే లాంటి ప్లేయర్ అవసరం. అయితే అది జరగడానికి ఆరు నెలల సమయం ఉంది. అప్పటిదాకా ఏమైనా జరగొచ్చు. శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటే అతనికే అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావించవచ్చు. అదీకాకుండా సర్ఫరాజ్ ఖాన్‌ని ప్లేస్ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. అతన్ని ట్రై చేయాలని సెలక్టర్లు అనుకోవచ్చు..
78
శుబ్‌మన్ గిల్, టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. టెస్టుల్లో కూడా మంచి ఆరంభం దక్కించుకోగలుగుతున్నాయి. మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్, ఫార్మాట్‌కి తగ్గట్టుగా ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది...
88
డబ్ల్యూటీసీ ఫైనల్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌తో పాటు ఐపీఎల్ మూడ్ నుంచి గిల్ ఇంకా బయటికి రానట్టుగా కనిపిస్తోంది.. టీ20 స్టైల్‌లో ఆడాలనే తొందరలో వికెట్లు పారేసుకున్నాడు.. ఇంకాస్త ఓపికగా ఆడడం నేర్చుకోవాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్..