ముంబై ఇండియన్స్‌లోకి అలా వచ్చా, అతనితో మంచి రిలేషన్ ఉంది... జస్ప్రిత్ బుమ్రా కామెంట్స్...

First Published Sep 6, 2021, 6:30 PM IST

ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ నుంచి టీమిండియాలోకి ఎంతోమంది ప్లేయర్లు వచ్చారు. ముంబై ఇండియన్స్ విజయాల్లో ఎక్కువ శాతం క్రెడిట్ దక్కించుకున్న జస్ప్రిత్ బుమ్రా, టీమిండియాలోకి ఓ సంచలన ఎంట్రీ ఇచ్చాడు... 

‘2013లో గుజరాత్, ముంబై మధ్య ఓ దేశవాళీ టీ20 మ్యాచ్ జరిగింది. అది నాకు సెకండ్ మ్యాచ్. ఆ మ్యాచ్ చూడడానికి జాన్ రైట్ కూడా వచ్చారు. నేను సెలక్ట్ అవుతానని, అస్సలు అనుకోలేదు... ఆ మ్యాచ్‌లో నేను ఒక ఒక్క వికెట్ తీశాను.

ఎక్కువ వికెట్లు తీయకపోయినా మంచిగా బౌలింగ్ చేశా. ఎక్కువ పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కంట్రోల్ చేశా. ఆ మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ చూడడానికి కూడా రైట్ వచ్చాడు. పార్థివ్ పటేల్‌ను, నా గురించి అడిగాడట...

జాన్ రైట్, కేవలం నన్ను ఆట పట్టించడానికి అలా చేస్తున్నాడని అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి ఫోన్ వచ్చింది. ‘ఆడడం ఇష్టమేనా’ అని అడిగారు, నేను ఎప్పుడూ రెఢీయే, మీరు రెఢీయేనా అని అడిగాను...

ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో లెజెండ్స్‌‌‌తో నేను కూడా రూమ్ షేర్ చేసుకోవడం ఓ మధురానుభూతి. 19 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, అనిల్ కుంబ్లే, మిచెల్ జాన్సన్, జాంటీ రోడ్స్ వంటి ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా...

ఓ అండర్19 క్రికెట్ ఆడుతున్న ప్లేయర్‌కి ఇలాంటి మూమెంట్ దొరుకుతుందని ఊహించడం కూడా కష్టమే... వాళ్లని కలిసి, మాట్లాడే అవకాశం దక్కినందుకు మురసిపోయా. కానీ నా పర్ఫామెన్స్‌పై నాకు అంతగా నమ్మకం లేదు...

మలింగను కలిసిన తర్వాత నాపై నాకు బాగా పెరిగింది. అతను కూడా నాలాగే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. కానీ తనే నా దగ్గరికి వచ్చి, ‘నేను నీ బౌలింగ్ చూశాను. చాలా బాగా వేస్తున్నావ్...’ అన్నాడు...

ఆ తర్వాత మలింగతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాలో చాలా టాలెంట్ ఉందని చెప్పి, నా బౌలింగ్‌పై నమ్మకాన్ని పెంచాడు మలింగ... 

నా చిన్నతనంలో యార్కర్ వేస్తే, వికెట్ తీయొచ్చని అనుకునేవాడిని. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో నాకు దక్కిన వికెట్లన్నీ యార్కర్ల ద్వారా వచ్చినవే. లెంగ్త్ బాల్స్, బౌన్సర్లు వంటివి అక్కడ ఉండవు... అందుకే యార్కర్లు వేయడం నేర్చుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చాడు జస్ప్రిత్ బుమ్రా...

click me!