అలాగే వాటి పేర్లు కూడా మార్చండి ప్రధాని గారూ... మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రిక్వెస్ట్...

Published : Aug 06, 2021, 09:30 PM IST

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత అథ్లెట్ల ప్రదర్శన సంతృప్తికరంగానే సాగింది. భారీగా పతకాలు రాకపోయినా, గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ సారి విశ్వక్రీడల్లో మనవాళ్ల ప్రదర్శన బాగానే సాగింది... ఇదే అదునుగా భావించిన భారత ప్రధాని, క్రీడా అవార్డు ఖేల్‌రత్న పేరును మార్చివేశారు...

PREV
19
అలాగే వాటి పేర్లు కూడా మార్చండి ప్రధాని గారూ... మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రిక్వెస్ట్...

1991లో ప్రవేశపెట్టిన అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న... అదే ఏడాది మరణించిన భారత ప్రధాని రాజీవ్‌గాంధీ పేరుతో ‘రాజీవ్ ఖేల్‌రత్న’గా పిలువబడుతోంది...

29

1991లో మొదటి ఖేల్‌రత్న అవార్డును చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ దక్కించుకోగా, 2020లో భారత క్రికెటర్ రోహిత్ శర్మ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బత్రా, రెజ్లర్ వినేశ్ ఫోగట్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, పారాలింపిక్ హైజంప్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకి ఖేల్‌రత్న వరించింది.

39

‘ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రదర్శన తర్వాత ఖేల్‌రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చాలంటూ అనేకమంది డిమాండ్ చేశారు. అందుకే ప్రజల కోరిక మేరకు రాజీవ్ ఖేల్‌రత్న ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా పిలువబడుతుంది...’ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ...

49

అయితే క్రీడా పురస్కారానికి, క్రీడా లెజెండ్‌ ధ్యాన్‌చంద్ పేరు పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా హాకీ లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌కి సరైన గౌరవం దక్కిందని అంటున్నారు హాకీ ఫ్యాన్స్...

59

ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చడంతో క్రికెట్ స్టేడియాలకు కూడా పేర్లు మార్చాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశంలో చాలా క్రికెట్ స్టేడియాలకు రాజకీయ నాయకుల పేర్లు ఉన్న విషయం తెలిసిందే...

69

‘అవార్డు పేరు మార్చాలనే ఆలోచన మంచిది. ఇలాగైనా ఓ క్రీడాకారుడు, క్రీడాకారుడి పేరు మీద పెట్టిన అవార్డును అందుకోవడాన్ని గర్వంగా భావిస్తారు. ఇది అన్ని క్రీడల్లోనూ మారుతుందని భావిస్తున్నా... ఇకపై నిర్మించే స్టేడియాలకైనా క్రీడాకారుల పేర్లు పెడతారని ఆశిస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...

79

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం... మొతేరా క్రికెట్ స్టేడియానికి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంగా భారత ప్రధాని పేరును పెట్టిన విషయం తెలిసిందే...

89

మొతేరా స్టేడియంతో పాటు నేవీ ముంబైలో డీవై పాటిల్ స్టేడియం, బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం, చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియం, ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం... రాజకీయ నాయకుల పేరుతో పిలువబడుతున్నాయి....

99

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి భారత మాజీ కెప్టెన్, మొట్టమొదటి వరల్డ్‌కప్ విన్నింగ్ భారత కెప్టెన్ కపిల్‌దేవ్ పేరు పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...

click me!

Recommended Stories