టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంటేటర్లుగా గంభీర్, గంగూలీ... విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే...

Published : Jun 02, 2023, 06:31 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ బ్యాటుతో అదరగొట్టాడు. 6 హాఫ్ సెంచరీలతో పాటు రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సీజన్‌కి ఘనమైన ముగింపు ఇచ్చాడు. అయితే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్, సౌరవ్ గంగూలీకి మధ్య ఉన్న వైరం మరోసారి బయటపడింది...  

PREV
17
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంటేటర్లుగా గంభీర్, గంగూలీ... విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే...
Virat Kohli Sourav Ganguly

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ టీమ్‌కి క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ వైపు కళ్లు ఉరిమి చూసిన విరాట్ కోహ్లీ, మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనతో చేతులు కలిపేందుకు కూడా ఇష్టపడలేదు...

27

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ, కావాలని విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాడనే విషయం స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడిన విషయం తెలిసిందే. దీనికి రియాక్షన్‌ ఐపీఎల్‌లో చూపించాడు విరాట్ కోహ్లీ...

37
Virat Kohli vs Sourav Ganguly

అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ కరచాలనం చేసుకోవడం కనిపించింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్‌ గురించి ట్వీట్ చేసిన గంగూలీ, విరాట్ పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది...

47
gambhir kohli

అలాగే లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులు విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ మ్యాచులుగా మారాయి. బెంగళూరులో గంభీర్ సెలబ్రేషన్స్‌ నచ్చకపోవడంతో లక్నోలో అంతకుముందు ఘాటుగా స్పందించాడు విరాట్ కోహ్లీ..

57
gambhir kohli

లక్నోలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎవ్వరూ మరిచిపోలేని మూమెంట్. ఈ గొడవ కారణంగా ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ చూడాలని అభిమానులు గట్టిగా కోరుకున్నా, గుజరాత్ టైటాన్స్ కారణంగా అది వీలు కాలేదు..

67
Gambhir-Kohli

అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ కామెంటేటర్లుగా అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్‌ ముగియడంతో లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఇద్దరూ... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంటేటర్లుగా వ్యవహరించబోతున్నారు...

77

ఐపీఎల్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మంచి టచ్‌లో ఉన్న విరాట్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సెంచరీ చేస్తే...కామెంటరీ బాక్సులో ఈ ఇద్దరి రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు కోహ్లీ అభిమానులు.. 

Read more Photos on
click me!

Recommended Stories