సిక్స్ కొడితే, ఆ బంతి మళ్లీ వాడేదిలే!... ఐపీఎల్ 2021 సీజన్‌లో కొత్త నిబంధన...

Published : Aug 08, 2021, 08:20 PM IST

యూఏఈలో తిరిగి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ తర్వాత జరిగే ఐపిఎల్‌లో ఓ నిబంధనను అమలులోకి తెచ్చిందట భారత క్రికెట్ బోర్డు...

PREV
110
సిక్స్ కొడితే, ఆ బంతి మళ్లీ వాడేదిలే!... ఐపీఎల్ 2021 సీజన్‌లో కొత్త నిబంధన...

ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు ముగిశాయి. మిగిలిన 31 మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసింది బీసీసీఐ... 

210

సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో సెకండ్ ఫేజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది... ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది...

310

కరోనా నిబంధనల కారణంగా యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురాబోతోంది యాజమాన్యం... 

410

యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి ప్రేక్షకులను అనుమతించాలని భావిస్తోంది బీసీసీఐ. అయితే వ్యాక్సిన్ సెషన్స్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే స్టేడియంలోనికి అనుమతి ఉంటుంది...

510

ప్రేక్షకులు నిండిన స్టేడియంలో ఏ ప్లేయర్ అయినా క్రౌడ్‌లోకి సిక్సర్ కొడితే, ఆ బంతిని తిరిగి ఉపయోగించరు. ఆ బంతి స్థానంలో మరో బంతిని వాడతారు... 

610

ప్రేక్షకులు తాకిన బంతిని తిరిగి ఉపయోగిస్తే, కరోనా వ్యాక్సిన్ వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిబంధనను అమలులోకి తేవాలని భావిస్తోంది బీసీసీఐ...

710

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇండియాలో జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఫేజ్ 2లో ఎలాంటి తప్పులూ, పొరపాట్లు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది బీసీసీఐ...

810

ఐపీఎల్‌లో వాడే క్రికెట్ బంతి ఖరీదు రూ.12 వేలకు పైగా ఉంటుంది. అందుకే ప్రేక్షకుల మధ్యలోకి కొట్టిన బంతిని సేకరించి, పూర్తిగా శుభ్రపరిచి... కొన్నిరోజులు భద్రపరుస్తారు...

910

అలాగే ఆటగాళ్ల ఆహారం, బయో బబుల్ విషయంలో అనేక నిబంధనలను అమలులోకి తేనుంది బీసీసీఐ. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి నేరుగా ఐపీఎల్ బయో బబుల్‌లో కలుస్తారు క్రికెటర్లు...

1010

బయో బబుల్ నుంచి మరో బయో బబుల్ ట్రాన్స్‌ఫర్‌కి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘాన్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో పాల్గొనబోతున్నారు...

click me!

Recommended Stories