రూ.30 లక్షలు సంపాదించి, క్రికెట్ వదిలేస్తా... వసీం జాఫర్ భార్యతో చెప్పిన ధోనీ, వేల కోట్లకు అధిపతిగా..

First Published Jul 7, 2023, 1:31 PM IST

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి 3 ఏళ్లు దాటినా, మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్, పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. నిజం చెప్పాలంటే ఈ మూడేళ్లలో మాహీ క్రేజ్ మరింత పెరిగింది. మాహీ మార్కెట్ కూడా అంతే...

ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ ఆస్తుల విలువ 127 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 1040 కోట్ల రూపాయలు. విరాట్ కోహ్లీ (రూ.2070 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ.1340 కోట్లు) తర్వాత అత్యధిక ఆస్తులు కలిగిన మూడో భారత క్రికెటర్‌గా ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ..
 

MS Dhoni

రీబాక్, గల్ఫ్ ఆయిల్, మెక్‌డొనాల్డ్స్ సోడా, బిగ్ బజార్, టీవీఎస్ మోటర్స్, సోనీ బ్రావియా, ఓరియో, డ్రీమ్11, ఒప్పో, ఇండిగో, కార్స్ 24, భారత్ మ్యాట్రిమోనీ, కిన్లే, స్నిక్కర్స్, మాస్టర్ కార్డ్, నెట్‌మిడ్స్‌ డాట్ కామ్... ఇలా దాదాపు 44 బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ..

Latest Videos


ms dhoni farming

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా ఏడాదికి రూ.12 కోట్లు అందుకుంటున్న ధోనీ, 16 సీజన్ల ద్వారా రూ.200 కోట్లకు పైగా ఆర్జించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ ద్వారా అధిక మొత్తం ఆర్జించిన క్రికెట్ ధోనీయే..
 

Charitable Work and Philanthropy

వివిధ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు కొన్ని నెలల ముందు సినిమా ప్రొడక్షన్ హౌజ్‌ని కూడా మొదలెట్టిన మాహీ, రాంఛీలోని ఫామ్‌ హౌజ్‌లో సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను దేశవిదేశాల్లో విక్రయిస్తున్నాడు..

Helicopter Shot

అయితే ఇన్ని ఆస్తులు సంపాదించిన ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌లో సక్సెస్ కావడానికి ముందు కేవలం రూ.30 లక్షలు ఉంటే చాలు, జీవితాంతం కూర్చొని బతికేయొచ్చని అనుకున్నాడట. ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ బయటపెట్టాడు..

‘‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందు ఓ సారి ధోనీ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నా భార్యతో ‘బాబీ... నేను రూ.30 లక్షలు సంపాదించాలి. ఆ 30 లక్షలు సంపాదిస్తే, ఇక ఈ క్రికెట్‌కి వదిలేస్తా.. అయితే ఏది ఏమైనా నేను రాంఛీని మాత్రం వదిలి వెళ్లను...’ అని చెప్పాడు... ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి .
 

ధోనీ చాలా చిన్న చిన్న కలలు కంటాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ధోనీ టార్గెట్స్ ఎప్పుడూ పెద్దగా ఉండవు. అందుకే సక్సెస్ చాలా పెద్దగా ప్రపంచానికి వినిపించింది..’’ అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్. 

click me!