తగ్గేదేలే! ఎమ్మెస్ ధోనీ వచ్చాక రచ్చ రేంజ్‌లో సీఎస్‌కే సెలబ్రేషన్స్... చెన్నైలో సీఎం‌తో కలిసి...

First Published Oct 18, 2021, 6:28 PM IST

చెప్పకూడదు కానీ, తమిళ తంబీలు ఏం చేసినా, అది ఓ రేంజ్‌లోనే ఉంటాయి. ఎందుకంటే వారికి ఎమోషన్స్ ఎక్కువే, సెంటిమెంట్స్ కూడా చాలా ఎక్కువే. అందుకే హీరోయిన్లకు గుళ్లు కట్టాలన్నా, హీరోలను దేవుళ్లుగా కొలవాలన్నా వారి తర్వాతే ఎవ్వరైనా.. అలాంటిది రెండేళ్ల తర్వాత గెలిచిన ఐపీఎల్ టైటిల్ సెలబ్రేషన్స్‌ని మాత్రం అంత సైలెంట్‌గా ఎలా కానిచ్చేస్తారు...

 ఐపీఎల్ 2021 టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌ని ఓ రేంజ్‌లో చేయాలని ప్లాన్ చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్...

నిజానికి ఇప్పటికే ఈ సెలబ్రేషన్స్ ప్రారంభం కావాల్సింది కానీ సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుతం భారత జట్టు మెంటర్‌గా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సేవలు అందిస్తున్నాడు. 

దీంతో మాహీ స్వదేశంలో అడుగుపెట్టగానే మోత మోగించబోతున్నట్టు సీఎస్‌కే యజమాని ఎన్ శ్రీనివాసన్ స్వయంగా తెలియచేశాడు...

‘టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి ఎమ్మెస్ ధోనీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సీఎస్‌కే టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేయబోతున్నాం. 

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటాడు ఎమ్మెస్ ధోనీ... దేశమంతా మోత మోగిపోయే విధంగా ఐపీఎల్ 2021 టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేయబోతున్నాం...’అంటూ కామెంట్ చేశాడు శ్రీనివాసన్..

అయితే ఇది అంత ఈజీ విషయం కాదు, ఎందుకంటే ఎమ్మెస్ ధోనీ, మెంటర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించి, స్వదేశానికి తిరిగి రావాలంటే టీ20 వరల్డ్ కప్ టోర్నీని పూర్తి చేయాల్సి ఉంటుంది. 

అంటే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు టైటిల్ గెలిస్తే, ఐపీఎల్ విజయాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు... వరల్డ్ కప్ విజయం ముందు ఐపీఎల్ టైటిల్ విజయం చిన్నదైపోతుంది... 

ఒకవేళ టీమిండియా నిరాశగా స్వదేశానికి తిరిగి వస్తే, టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోయిన బాధలో ఉన్న భారత ప్రజలకు సీఎస్‌కే విన్నింగ్ సెలబ్రేషన్స్... కొంచెం వింతగా అనిపించవచ్చు, ఎమ్మెస్ ధోనీపై, సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌పై ట్రోలింగ్ రావొచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!