టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

First Published Oct 18, 2021, 4:34 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొదలైపోయింది. ఏడో సీజన్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లోనే సంచలనాలు నమోదవుతున్నాయి... టీ20లు అంటే సిక్సర్ల మోత... టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ వీరే...

రాస్ టేలర్: న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 28 మ్యాచులు ఆడి 25 ఇన్నింగ్స్‌ల్లో 23 సిక్సర్లు బాదాడు... అయితే టేలర్‌కి ఈసారి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు...

జెపీ డుమినీ: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జెపీ డుమినీ, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 23 ఇన్నింగ్స్‌ల్లో 23 సిక్సర్లు బాదాడు..  

రోహిత్ శర్మ: టీమిండియా తరుపున గత ఆరు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొని, ఏడో టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్న ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మనే...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటిదాకా 28 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 25 ఇన్నింగ్స్‌ల్లో 24 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో రోహిత్ బ్యాటు నుంచి మరో 10 సిక్సర్లు వస్తే, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా టాప్ 2లోకి దూసుకుపోతాడు...

డ్వేన్ బ్రావో: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావ్, 29 టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడి, అందులో 25 ఇన్నింగ్స్‌ల్లో 24 సిక్సర్లు బాదాడు...

మహేళ జయవర్థనే: టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు జయవర్థనే. 31 టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన జయవర్థనే, 25 సిక్సర్లు బాది టాప్ 5లో ఉన్నాడు..

ఏబీ డివిల్లియర్స్: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్, 30 టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడి 29 ఇన్నింగ్స్‌ల్లో 30 సిక్సర్లు బాదాడు...

షేన్ వాట్సన్: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, 24 టీ20 వరల్డ్ కప్ మ్యాచులాడి 22 ఇన్నింగ్స్‌ల్లో 31 సిక్సర్లు బాదాడు... 

యువరాజ్ సింగ్: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, 31 టీ20 మ్యాచులు ఆడి, 28 ఇన్నింగ్స్‌ల్లో 33 సిక్సర్లు బాది, అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...

ఇందులో 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్, ఆ సీజన్‌లో 12 సిక్సర్లు రాబట్టాడు...

క్రిస్ గేల్: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్‌లో నిలిచాడు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 28 మ్యాచులు ఆడి 26 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు కొట్టి అదరగొట్టాడు క్రిస్ గేల్. అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 8లో ఉన్నవారిలో రోహిత్ శర్మతో పాటు బ్రావో, గేల్ మాత్రమే ఈసారి ప్లేయర్లుగా ఆడబోతున్నారు...

click me!