కోహ్లీ కెప్టెన్సీ పోవడంతోనే ఆ ఇద్దరూ అవుట్... విరాట్ సపోర్ట్‌తోనే అజింకా రహానే, శిఖర్ ధావన్‌...

First Published Dec 29, 2022, 11:42 AM IST

ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ ‘మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్స్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు శిఖర్ ధావన్.  2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు ధావన్. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ధావన్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది...

Image credit: Getty

2019 వన్డే వరల్డ్ కప్‌లో 2 మ్యాచులు ఆడి 125 పరుగులు చేసిన శిఖర్ ధావన్, గాయంతో టోర్నీలో మధ్యలో నుంచి తప్పుకున్నాడు. స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే కారణంగా టీ20ల నుంచి శిఖర్ ధావన్‌ని తప్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. 2016 నుంచి వరుసగా ఆరు సీజన్లలో 450+ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ధావన్. టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఎవ్వరూ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు...

Shikhar Dhawan

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో శిఖర్ ధావన్‌కి చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. టీ20ల్లో చోటు కోల్పోయినా వన్డేల్లో కొనసాగుతూ వచ్చాడు ధావన్. వచ్చే వరల్డ్ కప్ 2023 జట్టులో శిఖర్ ధావన్‌కి చోటు ఉంటుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...

అయితే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధావన్‌కి చోటు దక్కలేదు. 37 ఏళ్ల శిఖర్ ధావన్ కెరీర్ ఇక ముగిసినట్టేనని విశ్లేషిస్తున్నారు అభిమానులు. నిజానికి శిఖర్ ధావన్‌ని టీమ్‌ నుంచి తొలగించాలని ఎప్పుడో భావించారట సెలక్టర్లు...

Image credit: PTI

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత శిఖర్ ధావన్ పర్ఫామెన్స్ పడిపోతూ వస్తుండడంతో అతన్ని టీమ్ నుంచి తప్పించాలని ఫిక్స్ అయ్యారట. అయితే అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ టీమ్‌లో ఉండాలని పట్టుబడుతూ రావడం వల్లే ఇన్నాళ్లు టీమ్‌లో కొనసాగాడని సమాచారం...

2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ శిఖర్ ధావన్, యజ్వేంద్ర చాహాల్ ఉండాలని విరాట్ కోహ్లీ కోరాడని, అయితే మెంటర్ ఎంఎస్ ధోనీ ఈ ఇద్దరి కంటే రాహుల్ చాహాల్, వరుణ్ చక్రవర్తి, కెఎల్ రాహుల్‌కి ఓటు వేశాడని వార్తలు వినిపిస్తున్నాయి..

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అజింకా రహానే టీమ్‌లో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పుడు శిఖర్ ధావన్ కూడా జట్టు నుంచి తప్పించబడ్డాడు. ఛతేశ్వర్ పూజారాని తప్పించాలని చూసినా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రహానే, ధావన్ కూడా రీఎంట్రీ ఇవ్వాలంటే ఇలాంటిదేదో చేయాలని అంటున్నారు నెటిజన్లు.. 

click me!