నువ్వు బాగా బౌలింగ్ చేయాలి.. మనం గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా..! పతిరానను అలా మోటివేట్ చేసిన చాహర్

Published : May 24, 2023, 06:14 PM IST

IPL 2023 Playoffs:  చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ సంచలనం  మతీశ పతిరాన ఈ సీజన్ లో సీఎస్కే విజయాలలో కీలక పాత్ర పోషించాడు.   డెత్ ఓవర్లలో అతడు అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

PREV
16
నువ్వు బాగా బౌలింగ్ చేయాలి.. మనం గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా..! పతిరానను అలా మోటివేట్ చేసిన చాహర్
Image credit: PTI

ఈ ఏడాది ఐపీఎల్ లో  చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ కు చేరడంలో  ఆ జట్టు  డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్టు  మతీశ పతిరానది కీలక పాత్ర. ఈ సీజన్ కు ముందు ఏదో మలింగ బౌలింగ్ యాక్షన్ కలిగిఉన్నాడన్న పేరు తప్ప  పెద్దగా పరిచయం లేని పతిరాన  ఐపీఎల్ -16 లో  ప్రదర్శనలతో లంక క్రికెట్ లో హీరో అయిపోయాడు.   

26

ఐపీఎల్-16 లో పతిరాన  11 మ్యాచ్  లు ఆడి   42.2 ఓవర్లు బౌలింగ్ చేసి  17 వికెట్లు పడగొట్టాడు.   సీఎస్కేకు డెత్ ఓవర్లలో అత్యద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టిన  పతిరానను ధోని  అవసరాలకు అనుగుణంగా  చక్కగా వినియోగించుకున్నాడు. 

36
Image credit: PTI

నిన్న గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన మ్యాచ్ లో  కూడా ద పతిరాన.. 4 ఓవర్లే వేసి  28 పరుగులిచ్చి   2 వికెట్లు పడగొట్టాడు.   ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత  చాహర్.. పతిరాన పై ప్రశంసలు కురిపించాడు.  క్వాలిఫయర్ - 1 కు ముందు పతిరానను తాను ఎలా మోటివేట్ చేశాడో  చాహర్ చెప్పుకొచ్చాడు. 

46

గుజరాత్ తో మ్యాచ్ ముగిశాక   చాహర్ మాట్లాడుతూ.. ‘నేను  ఈ మ్యాచ్ కు ముందు  పతిరానతో మాట్లాడాను.  ఒకవేళ మనం (సీఎస్కే)  కప్ గెలిస్తే మనకు  3.8 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు  (లంక కరెన్సీలో రూ. 9 కోట్లు)  వస్తాయని చెప్పి మోటివేట్ చేశా. దాంతో అతడు చెలరేగిపోయాడు..’ అని ఫన్నీగా తెలిపాడు. 

56

దీపక్ చాహర్ కూడా ఐపీఎల్ - 16 ఫస్టాఫ్ లో  ఆకట్టుకోకున్నా తర్వాత  పుంజుకున్నాడు. ఫస్ట్ నాలుగు మ్యాచ్  లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన చాహర్.. తర్వాత తాను ఆడిన చివరి ఐదు మ్యాచ్ లలో మాత్రం ఏకంగా 12 వికెట్లు తీశాడు.  

66

స్టార్ బ్యాటర్లు అయిన  ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, జేసన్ రాయ్, రిలీ రూసో, శుభ్‌మన్ గిల్ వికెట్లు కూడా ఇందులో ఉండటం గమనార్హం.  గుజరాత్ తో మ్యాచ్ లో  చాహర్.. 4 ఓవర్లు వేసి 29 పరుగులే ఇచ్చి  2 వికెట్లు పడగొట్టాడు.  గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా,  స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ల వికెట్లు చాహర్ కే దక్కాయి. 

click me!

Recommended Stories