ధోనీ రికార్డును బ్రేక్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ అస్గర్... పసికూన జట్టుతో ప్రపంచ రికార్డు...

First Published Mar 20, 2021, 3:19 PM IST

ధోనీ రికార్డులు బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు. టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు మాహీ.... అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులను నిన్నమొన్నే ఎంట్రీ ఇచ్చిన ఓ పసికూన జట్టు కెప్టెన్ బద్దలుకొట్టబోతున్నాడు...

అయితే మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఇప్పటిదాకా కోహ్లీ ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినప్పటికీ విజయాల శాతంలో మాత్రం ధోనీని ఎప్పుడో దాటేశాడు...
undefined
స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత సారథిగా, విదేశాల్లో ఎక్కువ విజయాలు అందుకున్న టీమిండియా కెప్టెన్‌గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
కోహ్లీతో పాటు పసికూన దేశంగా గుర్తించబడిన ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘాన్ కూడా ధోనీ క్రియేట్ చేసిన ఓ రికార్డు బ్రేక్ చేసేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కాని ఘనత ఆఫ్ఘాన్ కెప్టెన్ చేసి చూపించాడు...
undefined
భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో 72 టీ20 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఇందులో 41 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది.
undefined
అయితే అస్గర్ ఇప్పటికే 51 టీ20 మ్యాచుల్లో ఆఫ్ఘానిస్తాన్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించి, 41 మ్యాచుల్లో విజయం అందుకున్నాడు.
undefined
అంటే ధోనీ రికార్డు అందుకోవడానికి అస్గర్ ఆఫ్ఘాన్, ఇంకో 21 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కటి గెలిచినా చాలు... అంతేకాకుండా మాహీ విజయాల శాతం కేవలం 59.28 మాత్రమే ఉండగా, అస్గర్ ఆఫ్ఘాన్ ఏకంగా 81 శాతానికి విన్నింగ్ పర్సెంటేజ్ పైగా సాధించాడు...
undefined
భారత జట్టు అండదండలతో క్రికెట్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది ఆఫ్ఘాన్ జట్టు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో అయితే ఏకంగా 545 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఆప్ఘనిస్తాన్ జట్టు...
undefined
రెహ్మతుల్లా షాహిదీ డబుల్ సెంచరీ చేయగా అస్గర్ ఆఫ్ఘన్ 160 పరుగులు చేశాడు. వీరితో పాటు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తూ, ఆఫ్ఘాన్‌కి సంచలన విజయాలు అందిస్తున్నారు...
undefined
click me!